- ప్రభాస్ త్రిష కాంబోలో 3 సినిమాలు..
- మొదటి మూవీ తోనే బ్లాక్ బస్టర్ హిట్
- రీల్ జోడి రియల్ జోడిగా మారాలనుకున్నారా..?


 సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరో హీరోయిన్ల కాంబోలో వచ్చే సినిమాలు ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంటాయి. ఇక వారి కాంబోలో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇండస్ట్రీలో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకుంటారు. ఇక అలాంటి వారిలో  ప్రభాస్ త్రిష జోడి ముందుంటుంది. ఇప్పుడు ఎలా అయితే ప్రభాస్ కి అనుష్క హిట్ పెయిర్ అనే టాక్ ఉందో అప్పట్లో ప్రభాస్ కి త్రిష మంచి జోడి అనే టాక్ ఉండేది. అప్పట్లో త్రిష ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి.. అయితే తెరమీద అద్భుతంగా కెమిస్ట్రీ పండించిన ఈ జంట పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారనే టాక్ కూడా అప్పట్లో వినిపించింది.

 ప్రభాస్ త్రిష జోడి:
ప్రభాస్ త్రిష కాంబినేషన్లో మొదటిసారి వర్షం మూవీ వచ్చింది. ఈ సినిమాలో గోపీచంద్ విలన్ గా నటించారు. ఇక మొదటిసారి వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇటు త్రిషకి అటు ప్రభాస్ కి తెలుగులో మంచి స్టార్డం లభించింది. దాంతో వీరిద్దరి కాంబోలో సినిమాలు తీయడానికి దర్శకులు క్యూ కట్టారు. ఈ సినిమా హిట్ అవ్వడంతో వీరి కాంబోలో పౌర్ణమి అనే మరో మూవీ కూడా వచ్చింది. అయితే ఈ సినిమాలో త్రిష చనిపోయి ఆ తర్వాత చార్మి వస్తుంది. అయినప్పటికీ త్రిష ప్రభాస్ మధ్య వచ్చిన సన్నివేశాలు  అందరినీ ఆకట్టుకున్నాయి.ఇక పౌర్ణమి మూవీ కూడా మంచి హిట్ అయింది. ఇప్పటికి కూడా ఈ సినిమాలో వచ్చిన పాటలు ఎంతోమందిని ఆకర్షిస్తాయి.. ఇక ఆ తర్వాత వీరి కాంబోలో బుజ్జిగాడు మూవీ కూడా వచ్చింది.ఈ సినిమాలో మోహన్ బాబు కీలకపాత్రలో నటించారు. కానీ ఈ సినిమా యావరేజ్ గా ఆడింది.కానీ ఈ మూడు సినిమాల్లో ఒకటి బ్లాక్ బస్టర్  అయ్యి రెండు సినిమాలు యావరేజ్ గా ఆడాయి అంటే దానికి కారణం ప్రభాస్ త్రిష మధ్య ఉన్న కెమిస్ట్రీ అనే చెప్పుకోవచ్చు.


 వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ బాగుండడంతో సినిమాలు యావరేజ్ హిట్టుగా నిలిచాయి. ఇక తెరమీద అందర్నీ అలరించిన ఈ జంట తెరవెనక కూడా ప్రేమాయణం నడిపించారనే టాక్ కూడా వినిపించింది. ప్రభాస్ త్రిష ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని ఆ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఎన్నో రూమర్లు గుప్పుమన్నాయి. ఇక వీరిద్దరి కాంబో హిట్ అవ్వడంతో పెళ్లికి కూడా రెడీ అయ్యారనే టాక్ వినిపించింది.ఇక వీరి గురించి బాగా తెలిసిన సినీ జర్నలిస్టులు కూడా త్వరలోనే వీళ్ళు పెళ్లి చేసుకుంటారని భావించారు. కానీ సడన్గా వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ బ్రేకప్ వరకు వెళ్ళింది.దానికి కారణం త్రిష మరో హీరోతో సాన్నిహిత్యంగా ఉండటమేనని అప్పట్లో టాక్ వినిపించింది. అలా మరో హీరోతో క్లోజ్ గా ఉన్న త్రిషని ప్రభాస్ తన భార్యగా అంగీకరించలేదు. దాంతో వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగిందనే రూమర్లు కూడా వినిపించాయి. ఇక ఈ బ్రేకప్ తర్వాత వీరిద్దరి కాంబోలో మళ్ళీ సినిమాలు తీయడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నించినా కూడా అది కుదరలేదు

మరింత సమాచారం తెలుసుకోండి: