రాజమౌళి వర్క్ పిచ్చోడు . వర్క్ కోసం రాత్రి పగలు నిద్రపోకుండా పని చేస్తాడు . అంతేనా పక్క వాళ్ళ చేత అంతే కఠినంగా వర్క్ చేయిస్తాడు. ఆయన అనుకున్న సీన్ అనుకున్నట్లు రాకపోతే ఆ సీన్ కోసం వంద సార్లు రీ షూట్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు అని చాలామంది హీరోస్ చెప్పుకు వచ్చారు. మరి ముఖ్యంగా రాజమౌళితో సినిమా చేయాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి .
షూట్ కి కరెక్ట్ టైం కి రావడం . అదే విధంగా మెడలో ఐడి కార్డ్ వేసుకోవడం. రాజమౌళి సినిమా కమిట్ అయిన తర్వాత వెరొక ఏ డైరెక్టర్ సినిమాతో కమిట్ కాకుండా ఉండడం . ఇలా బోలెడు కండిషన్స్ పెడుతూ వచ్చాడు రాజమౌళి . అంతేకాదు ఫుడ్ విషయంలో కూడా చాలా డైట్ ఫాలో అయ్యేలా చేస్తూ ఉంటాడు . అయితే అలాంటి రాజమౌళికే చుక్కలు చూపించాడు ఒక హీరో . ఆయన ఎవరో కాదు "ప్రభాస్".
ప్రభాస్ ..రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. అయితే ప్రభాస్ ఎంత మంచి ఫుడీ నో మనకు తెలుసు . ప్రభాస్ కి ఫుడ్ డైట్ అంటూ కండిషన్స్ పెట్టడంతో ఆయనకు కోపం తెగ వచ్చేసిందట . మరీ ముఖ్యంగా చత్రపతి సినిమాకి వర్క్ చేసేటప్పుడు ఎలాగోలా మ్యానేజ్ చేసిన ప్రభాస్ .. బాహుబలి సినిమాకి మాత్రం ఆయన పెట్టిన డైట్ ఫాలో అవ్వలేకపోయాడట . అంతేకాదు డైట్ విషయంలో రాజమౌళికి చాలా చాలా చుక్కలు చూపించాడట. బాహుబలి 1 కి కఠినంగా డైట్ ఫాలో అయిన ప్రభాస్ బాహుబలి 2 విషయంలో మాత్రం చాలా టార్చర్ చేశాడట. అయినప్పటికి ఈ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనకు తెలిసిందే. ప్రజెంట్ రాజమౌళి .. మహేష్ బాబు తో తెరకెక్కించే సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు..!