మన తెలుగు చిత్ర పరిశ్రమలో  కొన్ని కాంబినేషన్లు అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంటుంది .. అలాంటి కాంబినేషన్స్ లో నటసింహం బాలకృష్ణ, సీనియర్ హీరోయిన్‌ సిమ్రాన్ జంట ఎంతో ప్రత్యేకమైనది. బాలకృష్ణ, సిమ్రాన్ టాలీవుడ్ సూపర్ హిట్ జోడి. ఇక వీళ్లిద్దరూ కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి.. అందులో రెండు ఇండస్ట్రీ హిట్స్ గా ఉన్నాయి. సెకండ్ ఇన్నింగ్స్‌లో సిమ్రాన్ పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. సిమ్రాన్ , బాలయ్యతో ఇండస్ట్రీ హిట్ సినిమాలో నటించిన రికార్డ్ ఈమెకే సొంతం.


సిమ్రాన్ మొదటి సారి బాలయ్య సరసన బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సమర సింహా రెడ్డి’ చిత్రంలో జోడిగా నటించింది. ముందుగా  సమరసింహారెడ్డి సినిమా 1999 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అప్పట్లోనే టాలీవుడ్ లో ఉన్న అన్ని రికార్డులు తిరగరాసి బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. గొప్పింటి అల్లుడు |  ‘సమరసింహారెడ్డి’ తర్వాత బాలకృష్ణ, సిమ్రాన్ జోడిగా నటించిన సినిమా ‘గొప్పింటి అల్లుడు’. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది.


నరసింహనాయుడు | అలాగే మారోసారి బాలకృష్ణ సిమ్రాన్ జంటగా బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన నరసింహనాయుడు.. 2001 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం కూడా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. సీమ సింహం | బాలకృష్ణ, సిమ్రాన్ జోడిగా నటించిన నాల్గో చిత్రం ‘సీమ సింహం’. ఈ చిత్రం బాక్పాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. ‘సీమ సింహం’ తర్వాత చివరగా ’ఒక్క మగాడు’ చిత్రంలో వీళ్లిద్దరు జోడిగా నటించారు.


ఇక ఈ సినిమా తెలుగులో బిగ్ గ‌స్ట్‌ డిజాస్టర్ సినిమాల్లో ఒకటిగా మిగిలింది. ఇలా మొత్తంగా బాలకృష్ణ - సిమ్రాన్ కలిసి ఐదు సినిమాల్లో జంటగా నటించారు. ఇక బాలయ్య - సిమ్రాన్ కలిసి నటించిన ఐదు సినిమాల్లో రెండు ఇండస్ట్రీ హిట్స్ నిలవ‌గా ఒకటి యావరేజ్ గా మిగిలింది.రెండు డిజాస్టర్ మూవీస్ ఉన్నాయి. బాలకృష్ణ, సిమ్రాన్ కలిసి మ‌రోసారి కలిసి నటించబోతున్నట్టు సమాచారం. త్వరలో దీనిపై అఫీషియల్‌గా ప్రకటన రానుంది ఉంది. బాలయ్య.. బాబి తర్వాత చేయబోయే బొయ‌పాటి సినిమాలో  సిమ్రాన్‌ను ఓ పాత్ర కోసం తీసుకున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: