వీడియోలు లీక్‌ చేస్తాను అంటూ బాలీవుడ్ హీరోయిన్ అనన్యను బెదిరించిన స్టార్ హీరో కొడుకు .. బాలీవుడ్లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ లో సూపర్ క్రేజ్‌లో దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్లో అనన్య పాండే కూడా ఒకరు .. హిందీలో సీనియర్ నటుడు చుంకి పాండే వారసురాలుగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది .. ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇక గతంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాతో సౌత్ ప్రేక్షకులకు కూడా దగ్గరయింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో అనన్యకు అంతగా అవకాశాలు రాలేదు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ స్టార్ హీరో కొడుకు గురించి షాకింగ్ కామెంట్లు చేసింది. అయితే ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . బాలీవుడ్ లో ఓ స్టార్ హీరో కొడుకు త‌న‌నీ వీడియోస్ లిక్‌ చేస్తానని బెదిరించాడని ఆమె చెప్పకు వచ్చింది. ఇంతకీ అతను మరెవరో కాదు .. బాలీవుడ్ బాద్‌భాషా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్.. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.


ఇక అనన్య , ఆర్యన్ ఖాన్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు .. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అనన్య మాట్లాడుతూ రోజు నేనేం చేస్తాను ఏం తింటాను అన్ని వీడియోలు నేను రికార్డ్ చేసుకుంటాను కానీ వాటిని ఎప్పుడూ నేను సోషల్ మీడియాలో పబ్లిష్ చేయలేదు. అయితే ఇప్పటికీ  ఆ వీడియోలు నా దగ్గర ఉన్నాయి. అలాగే నేను సుహానా ఖాన్, షానాయ కపూర్ లు ఎప్పుడు ఏదో ఒకటి రికార్డ్ చేసే వాళ్ళం తర్వాత ఆర్యన్ మమ్మల్ని బెదిరించేవాడు తాను చెప్పిన పని చేయకపోతే మి వీడియోస్ లిక్ చేస్తానని ఆర్యన్ ఎప్పుడూ మమ్మల్నిని బెదిరించేవాడు. ఇవన్నీ ఎంతో మూఖ్య‌మైన మా చిన్ననాటి జ్ఞాపకాలు అంటూ సరదాగా చెప్పుకొచ్చింది అనన్య.


ఇదిలా ఉంటే.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్. ప్రస్తుతం దుస్తుల వ్యాపారంలో బిజీగా ఉన్న ఆర్యన్.. బిజినెస్ రంగంలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నాడు. త్వరలోనే తన చిత్రంతో అడియన్స్ ముందుకు రానున్నాడు. అనన్య ఇప్పటివరకు చాలా సినిమాల్లో పనిచేసింది. అతి తక్కువ సమయంలో అభిమానుల హృదయాలను ఏలింది. ఈ నటి రాబోయే సినిమా కోసం అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. నటి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియ‌లో సూప‌ర్ క్రేజ్ తో దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: