రాజమౌళితో సినిమా అంటే అందరూ ఎగేసుకొని ఓకే చేస్తారు . కచ్చితంగా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా చరిత్ర సృష్టిస్తుంది . రాజమౌళి తన రికార్డ్స్ తనే బద్దలు కొట్టుకుంటూ వస్తాడు . అయితే ఆ సినిమా అయిపోయిన తర్వాత ఆ హీరో పక్క డైరెక్టర్ తో వర్క్ చేసినప్పుడు మాత్రం కచ్చితంగా ప్లాప్ అవుతుంది. ఈ బ్యాడ్ సెంటిమెంట్ గురించి అందరికీ తెలిసిందే.  రాజమౌళితో సినిమా వర్క్ చేసిన తర్వాత మరొక డైరెక్టర్ తో వర్క్ చేస్తే కచ్చితంగా సినిమా ఫ్లాప్ అవుతుంది అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు .


ఇప్పటివరకు చరిత్ర చెబుతున్న పాఠం కూడా అదే . నాని - రవితేజ - ప్రభాస్ - జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోస్ అందరూ కూడా ఆ బ్యాడ్ సెంటిమెంట్ కి బలైపోయిన వారే . అయితే ఇప్పుడు రాజమౌళితో మహేష్ బాబు సినిమాను ఓకే చేశాడు . ఇక మహేష్ బాబు నెక్స్ట్ ఖాతాలో బిగ్ ప్లాప్ పడడం పక్క అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు . అయితే రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేయడానికి మహేష్ బాబు మైండ్ బ్లోయింగ్ ప్లాన్ రెడీ చేసుకున్నారట .



రాజమౌళితో సినిమా తర్వాత వేరే సినిమాలో నటిస్తే కచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అన్న బ్యాడ్ సెంటిమెంట్ నుంచి తప్పించుకోవడానికి ఆయన తన నెక్స్ట్ సినిమాని మల్టీస్టారర్ మూవీగా చూస్ చేసుకుంటున్నారట . ఇప్పటివరకు మహేష్ బాబు మల్టీస్టారర్ లో నటించింది "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" సినిమాలో మాత్రమే . అయితే ఇప్పుడు మరొకసారి మల్టీస్టారర్ మూవీలో నటించడానికి ప్లాన్ చేస్తున్నారట . తద్వారా రాజమౌళి సెటిల్మెంట్ ప్లాప్ ను కొంచెం అయిన బ్రేక్ చేయొచ్చు అన్న ఆలోచనలో ఉన్నాడట మహేష్ బాబు . మహా తెలివైనోడే కానీ ఈ ప్లాన్ ను ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది మాత్రం వేచి చూడాల్సిందే..!

మరింత సమాచారం తెలుసుకోండి: