టెంపర్ కు ముందు టెంపర్ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇస్మార్ట్ శంకర్ తో పూరీ జగన్నాథ్ కు పూర్వ వైభవం వచ్చిందని భావించిన అభిమానులకు ఆ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలతో ఒకింత భారీ షాకులే తగిలాయని చెప్పాలి. డబుల్ ఇస్మార్ట్ సినిమా అయితే నిర్మాతగా కూడా పూరీని ముంచేసింది.
తల, తోక లేని కథనంతో పూరీ జగన్నాథ్ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడంలో తడబడ్డారు. అయితే పూరీ జగన్నాథ్ కథను సిద్ధం చేసుకుని సిద్ధు జొన్నలగడ్డను సంప్రదించగా కొన్ని కారణాల వల్ల సిద్ధు జొన్నలగడ్డ ఈ ప్రాజెక్ట్ పై పెద్దగా ఆసక్తి చూపలేదని సమాచారం అందుతోంది. మరో కథతో సంప్రదించాలని సిద్ధు పూరీ జగన్నాథ్ కు సూచించారని సమాచారం.
ఇప్పటికే సిద్ధు జొన్నలగడ్డ జాక్ అనే సినిమాలో నటిస్తుండగా ఆ సినిమా కథకు పూరీ జగన్నాథ్ చెప్పిన కథకు పోలికలు ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. పూరీ జగన్నాథ్ పారితోషికం ఒకింత పరిమితంగానే ఉంది. పూరీ జగన్నాథ్ కు ఛాన్స్ ఇచ్చే నిర్మాత ఎవరో చూడాల్సి ఉంది. పూరీ జగన్నాథ్ కు కెరీర్ పరంగా భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పూరీ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.