టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మెగా ఫోన్ పట్టిన రాజమౌళి త్రిపుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ వరకు అసలు అపజయం అన్నది లేకుండా దూసుకుపోతున్నాడు. మరియు ముఖ్యంగా బాహుబలి 1 - బాహుబలి 2 - త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలు రాజమౌళి ఇమేజ్ ను భారతదేశం ఎల్లలు దాటించేసి ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేలా చేశాయి. రాజమౌళికి తమ బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు అంటే ఏ నిర్మాత అయిన ఉప్పొంగిపోతాడు. అసలు రాజమౌళి తమకు డేట్లు ఇచ్చాడు అంటే చాలు ఆ నిర్మాత కు అంతకన్నా కావాల్సింది ఏం ఉంటుంది ? ఇక ఏ హీరో అయినా కూడా రాజమౌళి తమతో సినిమా చేస్తున్నాడు అంటే అంతకు మించిన హ్యాపీ ఉండదు.
అయితే అలాంటి రాజమౌళికి .. టాలీవుడ్ ఓ ఓ అగ్ర నిర్మాతకు మధ్య చిన్న గ్యాప్ వచ్చింది. ఆ ఆగ్ర నిర్మాత ఎవరో కాదు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్. అరవింద్ నిర్మాతగా రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా మగధీర సినిమా తెరకెక్కి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాను ఒకే సారి తెలుగుతో పాటు హిందీ లో కూడా రిలీజ్ చేయాలని రాజమౌళి కండీషన్ పెట్టాడట. అయితే తెలుగులో యేడాది పాటు ఆడేశాక అరవింద్ దానిని హిందీలో డబ్ చేసి రిలీజ్ చేసినా దానిని హిందీలో ఎవ్వరూ పట్టించుకోలేదట. దీంతో పాటు రాజమౌళి వద్దని చెప్పినా మగధీర 100 రోజుల సెంటర్లు ప్రదర్శించడంతో పాటు ఫేక్ కలెక్షన్ల ను ప్రచారం చేయడంపై రాజమౌళి కి.. అరవింద్ కు మధ్య చిన్న పాటి డిస్కషన్ కూడా నడిచిందట. అలా రాజమౌళికి.. అరవింద్ కు మధ్య అప్పట్లో పొరాపొచ్చలు వచ్చాయి.