నట‌సింహ నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ త్వరలో నే హీరో గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే .. తన తొలి సినిమా ని క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రానుంది . ఇక మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా మూవీ ని ప్రకటించారు  .. అలాగే మోక్ష ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు . అయితే ఈ సినిమా ను ప్రశాంత్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెర‌కెక్కించనున్నాడు .. ఈ సినిమా అనౌన్స్మెంట్ తోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు అంచనాల ను ఆకాశాల కు తాకే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది .


మోక్షజ్ఞ తొలి సినిమా మహాభారతం నేపథ్యంలో ఉంటుందట . అలాగే ఇందులో అభిమన్యుడు పాత్ర లో మోక్షజ్ఞ క్యారెక్టర్ ఉంటుంద ని తెలుస్తుంది . ఇక మహాభారతం నేపథ్యంలో వచ్చే ఓ కీలక ఎపిసోడ్లో అభిమన్యుడు తో పాటు కృష్ణుడు,  అర్జునుడు పాత్రలు కూడా ప్రధానంగా చూపించనున్నారుట . ఇక అంతే కాదు ఈ రెండు పాత్రలో నందమూరి హీరో లు బాలకృష్ణ , ఎన్టీఆర్ నటిస్తారని కూడా అంటున్నారు . కృష్ణుడు గా  బాలకృష్ణ అర్జునుడి గా ఎన్టీఆర్ నటిస్తార ని టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ వార్త వైరల్ గా మారింది .


ఇలా ఒకే సినిమాలో ముగ్గురు నందమూరి హీరోలు, అందులోనూ పౌరాణిక పాత్రల్లో కనిపిస్తే అభిమానుల కు పండగే అని చెప్పవచ్చు. అప్పట్లో 'దాన వీర శూర కర్ణ' చిత్రంలో కృష్ణుడిగా సీనియర్ ఎన్టీఆర్, అర్జునుడిగా హరికృష్ణ, అభిమన్యుడిగా బాలకృష్ణ కనిపించారు. ఇక ఇప్పుడు కృష్ణుడిగా సీనియర్ ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ, అర్జునుడిగా హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్, అభిమన్యుడిగా బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కనిపిస్తే.. అభిమానులకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది. నిజంగానే ఈ ముగ్గురు కలిసి నటిస్తే, ఆ సినిమా సరికొత్త సంచలనాలు సృష్టిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: