సినిమా హీరోలు ఎవరైనా బాగుండాలని కోరుకుంటానని వెల్లడించారు. చిరంజీవి, బాలయ్య, నాగార్జున్, ప్రభాస్, అల్లు అర్జున్ కూడా బాగా చేయాలని.. కోరారు. సినిమా లు బాగుండాలంటే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధ బాగుండాలని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసుకుని ఆ తరువాత విందులు వినోదాలు చేసుకుందామని పిలుపునిచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్.
ఇవాళ పల్లె పండుగ వారోత్సవాలు ప్రారంభం అయిన తరునంలోనే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... ఎంఎల్ఏలు గత ప్రభుత్వంలో తిట్ల పురాణం తప్ప మరేమీ చేయలేదని ఆగ్రహించారు. 9 కోట్ల పని దినాలకు 4500 కోట్ల రూపాయల పనులు ఇవ్వడానికి తీర్మానం చేయడం దేశంలోనే మొదటిసారి అని తెలిపారు. ఆమోదించిన పనులు అన్నిటికి జిల్లా కలెక్టర్లు పరిపాలన అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంచాయితీరాజ్ గ్రామీణ శాఖకు సంబంధించి కేంద్రం ఇచ్చే డబ్బులున్నాయన్నారు.
అందుకే పవన్ కళ్యాణ్ దగ్గరే డబ్బులు ఉన్నాయని చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు పవన్. సంక్రాంతి నాటికి అన్ని పనులు పూర్తి చేసి జనవరి 25న మరికొన్ని పనులు ప్రారంభించాలని తెలిపారు. క్యాన్సర్ ను ముందుగా గుర్తించడానికి తెచ్చిన మొబైల్ కేన్సర్ డిటెక్షన్ సెంటర్ ను ప్రారంభిస్తామని తెలిపారు. మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ గురించి మోదీతో చర్చించి త్వరలోనే శుభవార్త అందిస్తామని పేర్కొన్నారు. కంకిపాడు కు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్ధ పై పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు.