సాధారణంగా ఒక సినిమా చేయాలి అనుకున్నప్పుడు ఇక దర్శక నిర్మాతలు ముందుగా హీరో హీరోయిన్లుగా ఎవరిని తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడూ బిజీగా ఉండే హీరో హీరోయిన్లకు  అడ్వాన్స్ ఇచ్చి సినిమా కోసం డేట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి అలా లేదు. ఏకంగా హీరో హీరోయిన్ల కంటే మరొకరి డేట్స్ కోసం ప్రస్తుతం అటు దర్శక నిర్మాతలు అందరూ కూడా ఎంతగానో ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. ఇది కాస్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 ఇలా హీరో హీరోయిన్ల డేట్స్ తర్వాత అయినా తీసుకోవచ్చు ముందు ఆ మ్యూజిక్ డైరెక్టర్ దొరుకుతాడో లేదో అని ఇక అతని డేట్సే ముందుగా బుక్ చేసుకుంటున్నారు. అంతలా అతని క్రేజ్ ఇప్పుడు పెరిగిపోయింది. అతను ఎవరో కాదు అనిరుద్ రవిచంద్రన్. అతన్ని చూస్తే ఈ కుర్రాడ ఇంత మంచి మ్యూజిక్ అందించింది అనే భావన కొత్తవాళ్లకు కలుగుతుంది. కానీ అతను కంపోస్ చేసిన పాటలు విన్న వాళ్ళకి మాత్రం వారెవ్వా మరోసారి అనిరుద్ అదరగొట్టేస్తాడు అని అనిపిస్తుంది.


 ఇప్పుడు వరకు ఎంతో మంది స్టార్ హీరోలకు మ్యూజిక్ అందించాడు. అతను అందించిన ప్రతి పాట కూడా ఒక ఆణిముత్యం లాంటిది. కుర్ర కారు మొత్తాన్ని ఉర్రూతలూగిస్తూ ఉంది. ఇక ఇటీవల దేవర సినిమా తో కూడా సూపర్ హిట్ కొట్టేశాడు అనిరుద్. ఇక దేవర మూవీ తర్వాత అతని కెరియర్ మొత్తం చేంజ్ అయింది. వరుస ఆఫర్ల తో పాటు అతని డేట్స్ కోసం ఎంతో మంది దర్శక నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు. దీంతో అతని పారితోషకం కూడా అమాంతం పెరిగి పోయింది అన్నది తెలుస్తుంది. ఇక అతనికి వచ్చిన క్రేజ్ చూసి అభిమానులు కూడా తెగ ఆనందపడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: