నందమూరి కళ్యాణ్ రామ్ తో బింబిసారా అనే సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు వశిష్ట.మళ్ళిడి. ఇక ఈ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ చూపు అతను వరకు మళ్ళింది. కాగా ఆ వెంటనే అదృష్టం కలిసి వచ్చి మెగాస్టార్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. మెగాస్టార్ తో ప్రస్తుతం విశ్వంభరా అనే మూవీ చేస్తున్నాడు. సోషియో ఫాంటసీ మూవీ గా ఈ సినిమా తెరకెక్కుతూ ఉండడం గమనార్హం. అయితే ఇక ఈ మూవీపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. ఈ సినిమాకు సంబంధించి టీజర్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురు చూశారు.
అయితే ఇటీవల టీజర్ విడుదలైన తర్వాత మాత్రం ఇక ఈ మూవీపై ట్రోలింగ్ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ సినిమాలోని విఎఫ్ఎక్స్ సన్నివేశాలు అన్నింటిని కూడా ఇతర సన్నివేశాల నుంచి కాపీ కొట్టేసారు అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. డ్యూణ్ సినిమా మ్యూజిక్, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, టైలర్ షాట్, అవతార్ డ్రాగన్స్, జురాసిక్ వరల్డ్, డైనోసార్ ఇలా ఎన్నో హాలీవుడ్ మూవీస్ నుంచి క్రియేటివ్ ఎలిమెంట్స్ ని కాపీ కొట్టి విశ్వంభర మూవీలో పెట్టారని ట్రైలర్ చూస్తే అర్థమవుతున్నట్టు ఎంతో మంది నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. టీజర్ లో కనిపించిన గ్రాఫిక్స్ కూడా వరస్ట్ గా ఉందని..ఇక దీని విషయంలో జాగ్రత్త పడకపోతే మరో ఆది పురుష్ అవుతుందని లేదంటే గతంలో విఎఫ్ ఎక్స్ కారణంగానే ఫ్లాప్ అయినా అంజి సినిమా పరిస్థితి ఇప్పుడు విశ్వంభరకు తప్పదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. టీజర్ చూసిన తర్వాత మెగాస్టార్ అభిమానులు సైతం ఆందోళన చెందుతున్నారట.