ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు రెండు భాగాలుగా తెరకెక్కడం సాధారణం అయిపోయింది. కొరటాల శివ దేవర1 విషయంలో కొన్ని పొరపాట్లు చేసినా దేవర2 సినిమాను మాత్రం భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నానని చెప్పగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. దేవర1 లో 10 శాతం చూపిస్తే దేవర సీక్వెల్ లో 100 శాతం చూపిస్తానని కొరటాల శివ చెప్పుకొచ్చారు.
 
అయితే లోకేశ్ కనగరాజ్ సైతం లియో సీక్వెల్ గురించి షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. లియో సినిమాలో తప్పుల విషయంలో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ పై విజయ్ తండ్రి ఫైర్ అయ్యారు. అయితే విమర్శల గురించి లోకేశ్ కనగరాజ్ స్పందిస్తూ నా దృష్టిలో లియో అనే సినిమా ఒక అద్భుతం అని చెప్పుకొచ్చారు.
 
ఛాన్స్ ఉంటే లియో సినిమాకు సీక్వెల్ చేయడననికి సిద్ధమేనని లోకేశ్ కనగరాజ్ పేర్కొన్నారు. విజయ్ ప్రస్తుతం రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో విజయ్ సినిమాలు చేసే అవకాశం ఉంటే లియో సీక్వెల్ కథను కచ్చితంగా చెబుతానని లోకేశ్ కనగరాజ్ పేర్కొన్నారు. లియో సీక్వెల్ కు పార్తీబన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశామని ఆయన వెల్లడించారు.
 
లియో సీక్వెల్ లో విజయ్ నటిస్తే మాత్రమే తెరకెక్కుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఎన్నో ప్రత్యేకతలతో లియో సీక్వెల్ తెరకెక్కుతుండగా ఈ సీక్వెల్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. లియో సీక్వెల్ లో ఊహించని ట్విస్టులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. లియో సీక్వెల్ తెరకెక్కితే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం పక్కా అని చెప్పవచ్చు. విజయ్ లియో సీక్వెల్ గురించి ఎలాంటి కామెంట్స్ చేస్తారో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి: