సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన నటుడు ఎక్కువగా కమర్షియల్ సినిమాలకే ఇంపార్టెన్స్ ఇవ్వడం చూస్తూ ఉంటాము. కమర్షియల్ హీరోగా రాణించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. కానీ దగ్గుబాటి అనే భారీ బ్యాగ్రౌండ్ నుంచి ఇండస్ట్రీకి పరిచయమైన రానా మాత్రం అలా కాదు.. ఎప్పుడు కూడా కమర్షియల్ హంగుల జోలికి పోలేదు. హీరోగా నిలదొక్కుకోవాలి అనే ప్రయత్నం చేయలేదు. నటుడిగా తనను తాను నిరూపించుకోవాలని తపన అతనిలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది.


 అందుకే అందరిలా కేవలం హీరోగా సినిమాలు చేయడం మాత్రమే కాదు. ఇతర హీరోల సినిమాల్లో విలన్ పాత్రలు చేయడం కూడా మొదలుపెట్టారు. కేవలం విలన్ పాత్రలేనా పాత్రలో వైవిధ్యం ఉంది అంటే చాలు ఎలాంటి సినిమాల్లో నటించడానికి అయినా సిద్ధమైపోతూ ఉంటాడు అని చెప్పాలి. ఇలా ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి తన నటనతో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు. అయితే అటు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాలో ఇక బల్లాల దేవుడిగా రానా నట విశ్వరూపం చూపించాడు అని చెప్పాలి.


 ఎంతలా అంటే ఆ పాత్రని రానా తప్ప ఇంకెవరు ఆ రేంజ్ లో పోషించలేరేమో అనేంతలా తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఇటీవల విడుదలైన సినిమాలోని విలన్ గా మెప్పించాడు. అయితే ఇక ఇప్పుడు రానా గురించి మరో ఇంటరెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమాలోను మరోసారి విలన్ గా రానాని తీసుకున్నాడట రాజమౌళి. ఆఫ్రికాలోని మసాయి తెగకు చెందిన కీలక సభ్యుడి పాత్రలో రానా కనిపిస్తాడట. రాజమౌళి కోరిక మేరకే రానా ఇందులో నటించడానికి ఒప్పుకున్నాడు అన్నది తెలుస్తుంది. ఏకంగా బల్లాల దేవుడి కంటే కర్కశంగా ఈ పాత్ర ఉంటుందట. ఇక ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించి రాజమౌళి నిర్వహిస్తున్న వర్క్ షాప్ లకి కూడా రానా హాజరవుతున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: