మన తెలుగు చతుర పరిశ్రమ లో ఒకేసారి మూడు సినిమాల తో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న హీరోలు కొంత మంది ఉన్నారు .. అయితే వారీలో అల్లు అర్జున్ , ఉదయ్ కిరణ్ కూడా ఒకరు . అల్లు అర్జున్ , గంగోత్రి సినిమా తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు . ఆ తర్వాత స్లోగా వరుస‌ సినిమాలు చేస్తూ పాన్‌ ఇండియా హీరో గా ఎదిగారు . రాఘవేందర్రావు దర్శకత్వంలో గంగోత్రి మ్యూజికల్ గా సూపర్ హిట్గా నిలిచింది తర్వాత సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన ఆర్య ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది .


సినిమా తర్వాత అల్లు అర్జున్ వి వి వినాయక్‌ దర్శకత్వం లో బన్నీ సినిమా చేశాడు . ఇది కూడా సూపర్ హిట్ గా నిలిచింది . అలా అల్లు అర్జున్ తన తొలి మూడు సినిమాలతో నే సూపర్ హిట్ కొట్టిటి కెరీయర్ని చాలా ఘనంగా మొదలు పెట్టాడు . అలాగే దివంగత నటుడు ఉదయ్ కిరణ్ కూడా ఎంతో ఘనంగా తన కెరీర్ను ప్రారంభించారు .. కానీ అంతే వేగంగా విషాదంగా ముగించేశారు . ఉదయ్‌ ముందుగా చిత్రం , నువ్వు నేను , మనసంతా నువ్వే సినిమాల తో యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు .


ఈ మూడు సినిమాలు కూడా హ్యాట్రిక్ విజయాలు గా నిలిచాయి . ఇండస్ట్రీలో ఉదయ్ మారు మోగి పోయింది .. తర్వాత ఉదయ్ కిరణ్ కెరియర్ అంతకంతకు దిగజారిపోయింది. వీరే కాకుండా అడ్విశేష్ , నాని , నవీన్ పోలిశెట్టి కూడా వరుస విజయాలు అందుకున్న హీరో లు ఇలా ఈ హీరోలు తొలి సినిమాల తోనే హట్రిక్ విజయాలు కొట్టి రేర్ రికార్డులను తమ ఖాతా లో వేసుకున్నారు . ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ మాత్రం పుష్ప2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు . డిసెంబర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: