తాజాగా దసరా పండగ ముగిసింది. దసరా పండుగ సందర్భంగా అనేక సినిమాలు థియేటర్లలో విడుదల అయ్యాయి. కాకపోతే దసరా పండుగ సందర్భంగా విడుదల అయిన సినిమాలలో ఏ సినిమాకు కూడా భారీ బ్లాక్ బాస్టర్ టాక్ రాలేదు. ఇక జనక అయితే ఘనక సినిమాకు పర్వాలేదు అనే టాక్ వచ్చిన ఈ మూవీ కూడా భారీ స్థాయి కలెక్షన్లను ఏమి బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేయడం లేదు. మరికొన్ని రోజుల్లోనే దీపావళి పండుగ రానుంది. ఇక దీపావళి పండుగ సందర్భంగా కూడా అనేక సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. మరి ఈ దీపావళి పండుగ సందర్భంగా ఏ సినిమాలు విడుదల కానున్నాయి.

అవి ఏ తేదీన విడుదల కానున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ "లక్కీ భాస్కర్" అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. మీనాక్షి చౌదరిమూవీ లో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని అక్టోబర్ 30 వ తేదీన ప్రీమియర్స్ తో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో పర్వాలేదు అనే స్థాయి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే నిఖిల్ ప్రస్తుతం అప్పుడు ఇప్పుడు ఎప్పుడో అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని అక్టోబర్ 31 వ తేదీన విడుదల చేయనున్నారు.

సత్యదేవ్ హీరోగా రూపొందిన జీబ్రా అనే సినిమాను కూడా ఇదే తేదీన విడుదల చేయనున్నారు. ఇక శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన ఆమరన్ సినిమాను కూడా ఇదే తేదీన విడుదల చేయనున్నారు. ఇక జయం రవి హీరోగా రూపొందిన భూచక్రం సినిమాను కూడా ఇదే తేదీన విడుదల చేయనున్నారు. ఇలా ఈ దీపావళి సందర్భంగా అనేక సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. మరి ఈ సినిమాలలో ఏ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: