సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది..ప్రస్తుతం మహేష్ దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో పాన్ వరల్డ్ సినిమాలో  నటించేందుకు సిద్ధమవుతున్నాడు...ఈ క్రమంలోనే ఆ సినిమా మేకోవర్‌లో బిజీగా గడుపుతున్నాడు.. ఆ సినిమా ఇంకా మొదలు కాకముందే ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇదిలా ఉంటే మహేష్ నటించిన ఓ బ్లాక్ బస్టర్ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట తెగ వైరల్‌ అవుతుంది..అదేమిటంటే మహేష్‌ సినిమా కథ కూడా వినకుండానే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట 15 రోజుల తర్వాత డైరెక్టర్ పట్టుబడితే కథ విన్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు.. మహేష్ పూరి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ బిజినెస్ మాన్... 

పూరి జగన్నాథ్‌ పై పూర్తి నమ్మకం వుంది అందుకే సినిమా కథ ఏంటని అడగాల్సిన అవసరం రాలేదంటూ మహేష్ చెప్పుకోచ్చాడు. కేవలం క్యారెక్టర్ విని కనెక్ట్ అయ్యానని వెంటనే సినిమా మొదలెట్టేసామని మహేష్ చెప్పుకొచ్చాడు.15 రోజుల షూటింగ్ తర్వాత పూరి జగన్నాథ్ పట్టుబట్టి కథ చెప్పారని మహేష్ వెల్లడించాడు. బిజినెస్ మాన్ సినిమా మహేష్ కెరీర్ లో ఓ డిఫరెంట్ మూవీ..సూపర్ స్టార్ మహేష్ ఈ సినిమాల్లో సూర్య క్యారెక్టర్ లో కనిపిస్తాడు.సినిమాలోని మహేష్ క్యారెక్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో.. ఆడియన్స్ సినిమాకు క్యూ కట్టారు. మహేష్ పూరి కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా కావడం అది కూడా సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో బిజినెస్ మాన్ సినిమా మంచి విజయం సాధించింది..ఈ సినిమాలో కాజల్ గ్లామర్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది..

మరింత సమాచారం తెలుసుకోండి: