సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది కి అవకాశాలు చాలా ఈజీగా వస్తూ ఉంటాయి. దానితో చాలా తొందరగానే స్టార్ హీరోయిన్స్ స్థాయికి వెళ్లిన ముద్దు గుమ్మలు కూడా అనేక మంది ఉన్నారు. ఇకపోతే మరి కొంత మంది కి మాత్రం సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు అంత తేలిగ్గా రావు. వాటి కోసం అనేక ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. అలాగే కొంత మంది సినిమా అవకాశాల కోసం ముందుగా తమ నటన ప్రతిభను చూపించడం కోసం షార్ట్ ఫిలిమ్స్ లలో కూడా నటిస్తూ ఉంటారు. అలా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తమ టాలెంట్ నీ నిరూపించుకొని సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అయిన నటీమణులు కూడా ఎంతో మంది ఉన్నారు.

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి నారా రోహిత్ మరికొన్ని రోజుల్లోనే సిరి లేల్లా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న విషయం మనకు తెలిసిందే  ఈ ముద్దుగుమ్మ సినిమా హీరోయిన్. కొంత కాలం క్రితం నారా రోహిత్ "ప్రతినిధి 2" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సిరి లెల్లా హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతోనే ఈ ముద్దు గుమ్మ హీరోయిన్గా వెండి తెరకు పరిచయం అయింది. ఇకపోతే ఈమె ప్రతినిధి 2 సినిమా కంటే ముందు ఓ షార్ట్ ఫిలింలో కూడా నటించింది.

ఇక తాజాగా ఈ షార్ట్ ఫిలిం న్యూస్ వెలుగు లోకి వచ్చింది. ఇక ఈ షార్ట్ ఫిలిం కు దర్శకత్వం వహించింది మరి ఎవరో కాదు జబర్దస్త్ కమెడియన్ బాబు. కెరియర్ స్టార్టింగ్ లో తొలిచూపులోనే అనే షార్ట్ ఫిలిం లో ఈ ముద్దు గుమ్మ నటించింది. ఇక ఈ షార్ట్ ఫిలిం లో ఈమె తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంది. ఈ షార్ట్ ఫిలిం వచ్చి ఇప్పటికే 10 ఏళ్ళు అవుతుంది. ఈ షార్ట్ ఫిలిం వచ్చి ఇప్పటికే చాలా కాలం కావడంతో తొలి చూపులోనే షార్ట్ ఫిలిం లో ఉన్న సిరి లెల్ల కి ఇప్పటి సిరి లెల్ల కి చాలా మార్పులు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: