ప్రస్తుతం ఎక్కడ చూసినా నారా రోహిత్ పెళ్లి వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి.ఎందుకంటే 40 ఏళ్లు వచ్చినా ఈ హీరో ఇంకా పెళ్లి చేసుకోకుండా సడన్గా పెళ్లి అంటూ షాక్ ఇవ్వడంతో అందరూ ఈయన పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు.. పల్నాడు జిల్లాకు చెందిన రెంటచింతల  వాసి మన నారా రోహిత్ కి కాబోయే భార్య.. శిరీష అనే అమ్మాయి కాస్త సినిమాల్లోకి వచ్చాక సిరి లేళ్ల గా పేరు మార్చుకుంది. సిరి లేళ్ళ ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన అమ్మాయి. ఆస్ట్రేలియాలో పెద్ద పెద్ద చదువులు చదివి కొద్ది రోజులు జాబ్ చేశాక సినిమాల మీద ఆసక్తి ఉండడంతో హైదరాబాద్ కు వచ్చేసి తన సోదరి దగ్గర ఉంటూ సినిమాల్లో ట్రై చేసింది. అలా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో చేశాక నారా రోహిత్ ప్రతినిధి టు మూవీలో అవకాశం వచ్చింది. అలా ఈ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఇక ఈ సినిమా చేసినప్పటి నుండే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి చాలా రోజులు దీన్ని సీక్రెట్ గా ఉంచారట. 

ఇదంతా పక్కన పెడితే నారా రోహిత్ గతంలోనే ఓ హీరోయిన్ తో పెళ్లి వరకు వెళ్లారట.కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఆ ప్రేమ బ్రేకప్ అయినట్టు తెలుస్తోంది. ఇక నారా రోహిత్ ప్రేమించిన ఆ హీరోయిన్ ఎవరో కాదు రెజీనా కసాండ్రా.. రెజీనా నారా రోహిత్ కాంబినేషన్లో జో అచ్యుతానంద సినిమా వచ్చింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే రెజీనా నారా రోహిత్ మధ్య క్లోజ్నెస్ పెరిగి ఇద్దరు డేటింగ్ చేశారట. ఆ తర్వాత శంకర, బాలకృష్ణుడు వంటి మూవీస్ లో కూడా ఇద్దరూ కలిసి నటించారు. కానీ ఈ సినిమాలు యావరేజ్ గా ఆడాయి. అయితే సినిమాల మాట పక్కన పెడితే వీరిద్దరూ సీరియస్ రిలేషన్షిప్ లో ఉండి పెళ్లి చేసుకుందాం అని కూడా అనుకున్నారట.

అలా చాలాసార్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగి మీడియా కంట కూడా పడ్డారు. కానీ అప్పటికే రెజీనా కసాండ్రా కి ఇండస్ట్రీలో ఎన్నో ఎఫైర్స్ ఉన్నాయి అనే విషయం తెలుసుకున్న నారా ఫ్యామిలీ రెజినాని తమ ఇంటి కోడలుగా అస్సలు ఒప్పుకోలేదట. ఇక ఇంట్లో వాళ్ళ మాట కాదని రెజీనాని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక నారా రోహిత్ కూడా రెజీనాకి బ్రేకప్ చెప్పారట.ఇక వీరిద్దరూ పరస్పర అంగీకారంతో బ్రేకప్ చెప్పుకోవడంతో వీరి ప్రేమ పెళ్లి దాకా వెళ్లకుండానే మధ్యలోనే వీరి బంధం తెగిపోయింది. అలా రెజినాని పెళ్లి చేసుకోవాల్సిన నారా రోహిత్ చివరికి సిరి లేళ్ల ని పెళ్లాడబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: