వారం రోజుల క్రితం పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించి రెండు సన్నివేశాలు చూశానని డిసెంబర్ లో విడుదలయ్యే పుష్ప2 మూవీ తెలుగు సినిమాల స్థాయిని మరో రేంజ్ కు తీసుకెళ్తుందని బలంగా నమ్ముతున్నానని చెప్పుకొచ్చారు. ఎస్కేఎన్ చేసిన ఈ కామెంట్లతో పుష్ప ది రూల్ మూవీ విషయంలో ఆయన ఏ స్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారో సులువుగానే అర్థమవుతుందని చెప్పవచ్చు.
బన్నీ ఇదే ఫామ్ ను కొనసాగిస్తే వచ్చే ఏడేళ్లలో ఇండియాలో ఉన్న అన్ని అవార్డులను కొట్టేస్తాడనే ఫీలింగ్ పుష్ప2 సీన్స్ ను చూస్తున్నప్పుడు కలిగిందని ఎస్కేఎన్ తెలిపారు. ఒక యాక్టర్ పీక్స్ లో ఉన్న సమయంలో అలా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. హీరో, డైరెక్టర్ టాప్ ఫామ్ లో ఉన్న సమయంలో అలాంటి ప్రాడక్ట్ మాత్రమే వస్తుందని ఆయన వెల్లడించడం గమనార్హం.
పుష్ప ది రూల్ సీన్స్ చూసిన సమయంలో నాకు అలా అనిపించిందని ఎస్కేఎన్ అన్నారు. ఎస్కేఎన్ కామెంట్లతో పుష్ప2 సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశం ఉంటుంది. పుష్ప2 సినిమా 2024 బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే ఛాన్స్ అయితే ఉంది. బన్నీ బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు. పుష్ప ది రూల్ సినిమాలో రష్మిక, అనసూయ పాత్రలకు సంబంధించిన ట్విస్టులు ఉంటాయని మరికొన్ని కొత్త పాత్రలు సైతం పరిచయం అవుతాయని సమాచారం అందుతోంది.