లైఫ్ చాలా సెన్సిటివ్ . ఒకసారి ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే .. మళ్ళీ మనం ఆ కరెక్ట్ పొజిషన్ కి చేరుకోవడం చాలా చాలా కష్టం . అందుకే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించాలి ఒకటికి పది సార్లు కాదు నేటి జనరేషన్ కి ఇప్పుడు మారుతున్న టెక్నాలజీకి ఒకటికి 100 సార్లు ఆలోచించినా తప్పులేదు అంటున్నారు మన పెద్దవాళ్లు . అయితే మనం తెలిసి తెలియక పొరపాటున ఫ్లోలో తీసుకున్న కొన్ని డెసిషన్స్ మన లైఫ్ నే తలకిందలు చేసేస్తాయి. దానికి ది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పూజా హెగ్డే .


అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే "ముకుంద" సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . ఈ సినిమాతో మంచి హీరోయిన్ గానే పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా కూడా పూజా హెగ్డే అంటే పడి చచ్చిపోయారు కుర్రాళ్ళు.  ఆ తర్వాత ఎలా గోలా దువ్వాడ జగన్నాథం సినిమాతో హిట్ అందుకుంది . ఇక తన కెరియర్ వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా ముందుకు వెళ్ళిపోయింది .



అయితే కెరియర్ పిక్స్ లో ఉండగానే ఆమె హై రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి కొన్ని సినిమా అవకాశాలను వదులుకోవడం . అదేవిధంగా తలతిక్కల ఆలోచనలతో కొన్ని సినిమాలను ఓకే చేయడం . ఆమె కెరియర్నే ముంచేశాయి . ప్రజెంట్ పూజ హెగ్డే ఎలాంటి  పొజిషన్లో ఉందో మనకు తెలిసిందే.  అయితే మళ్లీ పూజా హెగ్డే తన పేరుకి పునర్వైభవం తెచ్చుకోవాలి అంటే కచ్చితంగా ఆమె కొన్ని స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవాలి ..డబ్బులు అని చూడకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటే ఖచ్చితంగా పూజ హెగ్డే కు తెలుగు ఇండస్ట్రీలో బడా హీరోలతో అవకాశాలు దక్కించుకునే ఛాన్సెస్ చాలా ఉన్నాయి.  చూద్దాం మరి పూజ హెగ్డే డబ్బుకు మోజు పడకుండా మంచి మంచి అవకాశాలను దక్కించుకుంటుందో లేదో..?

మరింత సమాచారం తెలుసుకోండి: