కృతి శెట్టి కన్నడ హీరోయిన్ . ఉప్పెన సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది . మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకోవడమే కాకుండా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది . ఆ తర్వాత నటించిన సినిమాలు కూడా హిట్ అయ్యాయి . అయితే సడన్ గా ఆమె నటించిన సినిమాలు మళ్లీ ఫ్ల్లప్ అవడం మొదలుపెట్టాయి. ఒకటి కాదు రెండు కాదు ఆమె నటించినా మొదటి మూడు సినిమాల తర్వాత ఆమె చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి . కోలీవుడ్ లో మాత్రం మంచిగా అవకాశాలు దక్కించుకుంటుంది.
తెలుగులో అవకాశాలు దక్కించుకుంటున్న ఆ సినిమాలు హిట్ కాలేకపోతున్నాయి అందుకే తెలుగు సినిమాలకి కొన్నాళ్లపాటు ఫుల్ స్టాప్ పెట్టేయాలని డిసైడ్ అయింది . కృతి శెట్టి ని అదృష్టం వరించింది . ఏకంగా రామ్ చరణ్ సినిమాలోనే అవకాశం కొట్టేసింది . సుకుమార్ డైరెక్టర్గా రాంచరణ్ హీరోగా ఓ సినిమాని కమిట్ అయ్యారు. ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా జాన్వి కపూర్ సెలెక్ట్ అయింది . అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా బేబ్బమ్మ సెలక్ట్ అయ్యింది అంటూ నెట్టింట ఓ వార్త తెగ సర్కులేట్ అవుతుంది .
అంతేకాదు కృతి శెట్టి - చరణ్ కు లవర్ గా ఈ సినిమాలో కనిపించబోతుందట . చరణ్ కి మరదలు పాత్రలో జాన్వి కపూర్ కనిపించబోతుందట . కృతి శెట్టి ఈ సినిమాతో హిట్టు అందుకుంటే మళ్ళీ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు మంచి పొజిషన్ వస్తుంది అనడంలో సందేహం లేదు. 100 జన్మలెత్తినా సరే ఇలాంటి లక్కీ ఛాన్స్ మళ్లీ రాదు అంటున్నారు మెగా ఫ్యాన్స్. చూద్దాం మరి కృతిట్టి ఈ ఆఫర్ ని ఎలా యుటిలైజ్ చేసుకుని సక్సెస్ అవుతుందో..?