ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ కార్యక్రమం ఎంతగానో ప్రేక్షకులను అలరిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు ఎవరికీ తెలియని సినీ సెలబ్రిటీలు హౌస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్లారు అని ప్రేక్షకులందరూ అనుకున్నారు. దీంతో అటు రేటింగ్ కూడా ఒక్కసారిగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే మళ్లీ షో రేటింగ్ పెంచేందుకు గత సీజన్లలో అలరించిన మాజీ కంటెస్టెంట్ లను హౌస్ లోకి పంపించారు.


 ఇక ఇలా మాజీ కంటెస్టెంట్స్ రాకతో హౌస్ లో మరోసారి రచ్చ రచ్చ జరుగుతుంది. షో రేటింగ్ కూడా అంతకంతకు పెరిగిపోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే గతంలో నాలుగో సీజన్లో బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్  గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించిన గంగవ్వ ఇక ఇప్పుడు ఎనిమిదవ సీజన్లో మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఎనిమిదవ సీజన్లో సరికొత్త గంగవ్వని చూస్తున్నారు ప్రేక్షకులు. ఒకప్పుడు అమాయకత్వంతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన గంగవ్వా ఇక ఇప్పుడు మాత్రం ఫుల్ స్ట్రాటజీతోనే కనిపిస్తుంది. దీంతో గంగవ్వ గేమ్ ప్లాన్ చూసి అటు ఫ్యాన్స్ సైతం షాక్ అవుతున్నారు. అమాయకంగా ఉండే గంగవ్వలో ఇంత గేమ్ స్పిరిట్ ఉందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.


 అయితే ఇటీవల బిగ్ బాస్ నామినేషన్ కి సంబంధించిన ప్రోమో విడుదలవ్వగా ఇక గంగవ్వను చూసి అందరూ షాక్ అయ్యారు. నాకు సరిగ్గా సేవలు చేయలేదు అందుకే నామినేట్ చేస్తున్న అంటూ గంగవ్వ చెప్పగా.. అటు నయని సేవలు చేసింది కదా అని అనడంతో.. అది నాతోనే సరిగ్గా లేదు. నాకు అసిస్టెంట్ ఎలా అవుతుంది అంటూ నయని పావని పై సీరియస్ అయింది గంగవ్వ. తర్వాత నయని ఏదో చెప్పాలని అనుకుంటుండగా.. ఇక గట్టిగా అరిచి ఏకంగా నయని నోరు మూయించింది. ఇక తర్వాత గంగవ్వ నామినేషన్ ప్రేరణ యాక్సెప్ట్ చేసింది. అయితే ఇక ఇలా హౌస్ లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ప్రతి విషయంలో కూడా ఎంతో స్ట్రాటెజిక్ గా చిక్కు ఆలోచిస్తూ ముందుకు సాగుతుంది గంగవ్వ. దీంతో ఇక ఆమె తెలివికి అందరు ఫీదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: