* టికెట్ల ధరలు పెరగడంతో Ibomma, OTTలకు పెరిగిన ఆదరణ
* 1000 కోట్ల సినిమా అయిన థియేటర్లకు వెళ్లని జనాలు
* సామాన్యులకు టికెట్ కొని సినిమాలకు వెళ్లని దుస్థితి
మన టాలీవుడ్ ఇండస్ట్రీలో రకరకాల సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ప్రపంచ స్థాయికి మన టాలీవుడ్ ఇండస్ట్రీ వెళ్ళింది. ఎంతో గొప్ప అవార్డులను కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన సినిమాలు అందుకోవడం మనం చూస్తున్నాం. ఇంత గొప్పగా ఎదుగుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీలో... సామాన్యుడికి అన్యాయం జరుగుతోందని కొంతమంది భావిస్తున్నారు.
ముఖ్యంగా టికెట్ల ధరలు విపరీతంగా పెంచేసి.. జనాల రక్తం పీల్చుతున్నారని అంటున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు చేసి... సినిమాలు రిలీజ్ చేసిన అనంతరం టికెట్ల ధరలు విపరీతంగా పెంచుతున్నారు. ఒక్కో టికెట్ 5000 రూపాయలకు కూడా... మొదటి రోజు అమ్మడం జరుగుతుంది. తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టికెట్ల ధరలు పెంచుకోమని.... దాదాపు 10 నుంచి 15 రోజుల సమయం ఇస్తున్నారు.
ఒక సామాన్యుడు 50 రూపాయల వరకు టికెట్ ధర పెట్టి... సినిమా చూడవచ్చు. గతంలో ఇదే జరిగింది. కానీ ఇప్పుడు... సినిమా రిలీజ్ అయిన రోజు మినిమం 1000 రూపాయలు ఉంటేనే... సినిమాలు చూసే పరిస్థితి ఉంది. అంత డబ్బు సామాన్యుడు ఎక్కడి నుంచి పెడతాడు..? ఈ హీరోల కోసం తెలుగు ప్రేక్షకులు అనవసరంగా ఖర్చు పెడుతున్నారని కొంతమంది అభిమానులు అంటున్నారు.
భారీ రెమ్యూనరేషన్ అలాగే భారీ బడ్జెట్ తో సినిమాలు తీసి... జనాల రక్తం పీల్చుతున్నారని... కొంతమంది సినిమా ఫ్యాన్సే మండిపడుతున్నారు. అయితే... సినిమా టికెట్ల ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో... ఐ బొమ్మ అలాగే ott లలో జనాలు సినిమాలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రిలీజ్ అయిన రోజు సినిమా చూసే కంటే.. ఐ బొమ్మ లాంటి చిన్న చిన్న ఫ్లాట్ ఫామ్ లో.. సినిమా వచ్చిన తర్వాత డౌన్లోడ్ చేసి చూసుకుంటున్నారు. కొంతమంది అమెజాన్ ప్రైమ్ లేదా నెట్ ఫ్లిక్స్ మాత్రమే ఎంచుకుంటున్నారు. 1000 కోట్ల సినిమా అయినా సరే.. వెయిట్ చేస్తున్నారు కానీ థియేటర్లకు మాత్రం వెళ్లడం లేదట.