* పాన్‌ ఇండియా పేరుతో భారీ మోసాలు
* కథలో దమ్ము లేకున్నా పాన్‌ ఇండియా పేరుతో సినిమాలు రిలీజ్‌
* పాన్‌ ఇండియా పేరుతో జనాల జేబులకు చిల్లు
* సొల్లు, రొటీన్ సినిమాలకు రూ.5000 డిమాండ్‌



మన టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా మన సినిమాలను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. ఈ మధ్యకాలంలో ఆస్కార్ రేంజ్ కు మన టాలీవుడ్ ఇండస్ట్రీ వెళ్లిందంటే దానికి కారణం... మన తెలుగు దర్శకులే.  అయితే ఇక్కడి వరకు అంతా బాగుంది కానీ... ఈ మధ్యకాలంలో...  టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతంగా పాన్ ఇండియా పేరుతో సినిమాలు వస్తున్నాయి. పాన్ ఇండియా పేరుతో రిలీజ్ చేసి... విపరీతంగా డబ్బులు దండుకుంటున్నారు.


సినిమా ప్రేక్షకుల...  జేబులకు చిల్లు పెడుతున్నారని ఫ్యాన్స్ ఆగ్రహిస్తున్నారు.  ఒక్కో సినిమా టికెట్ ధర 5000 రూపాయలు కూడా... పెట్టి అమ్మేస్తున్నారట. సినిమా రిలీజ్ అయిన నుంచి దాదాపు పది రోజుల వరకు... టికెట్లు ధరలను పెంచుకునేలా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి తెచ్చుకొని... జనాల రక్తం పీల్చుతున్నారట. అయితే 5000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నా కూడా...  ఆ సినిమా కథలో దమ్ము కూడా ఉండాలని చెబుతున్నారు.


కానీ కథలో దమ్ము లేకుండా... సొల్లు పురాణం పెట్టి సినిమాలు తీస్తున్నారని అభిమానులు అంటున్నారు. ఎప్పుడు రొటీన్ కథలు,  బ్రేకప్ స్టోరీలు లేదా హారర్  కథలతో సినిమాలు తీసి దానికి పాన్ ఇండియా అని మేకప్ వేస్తున్నారట. దీనిపై సాటి ప్రేక్షకుడు మండిపడుతున్నాడు.  రాజకీయ నాయకుల కంటే అత్యంత దారుణంగా  దర్శకుడు మోసం చేస్తున్నాడని మండిపడుతున్నారు అభిమానులు.


తమ అభిమాన హీరో కోసం సినిమాకు 5000 రూపాయలు టికెట్ ధర పెట్టి... సినిమాకు వెళ్తే తమకు చుక్కలు చూపిస్తున్నారని ఆగ్రహిస్తున్నారు ఫ్యాన్స్. ఈ సొల్లు అలాగే రొటీన్ సినిమాలకు 5000 రూపాయలు పెట్టాలా అని కూడా మండిపడుతున్నారు. ఇకనైనా దర్శకులు... తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేయాలని కోరుతున్నారు. భారీ బడ్జెట్ కాకుండా తక్కువ బడ్జెట్లో సినిమాను ఫినిష్ చేసి... ఎక్కువ డబ్బులు సంపాదించాలని కోరుతున్నారు. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా టికెట్ ధరలను ఫిక్స్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.














మరింత సమాచారం తెలుసుకోండి: