సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు విడుదలైతే ఆ సినిమాలను తొలిరోజే థియేటర్లలో చూడాలనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిన తర్వాత సినిమా టికెట్ రేట్లు అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్, కేసీఆర్ సీఎంలుగా ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితి అయితే లేదనే సంగతి తెలిసిందే.
 
సినిమా వాళ్ల‌కు అస‌లు సిస‌లు మొగుళ్లు జ‌గ‌నూ కేసీఆరే అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జగన్ ఒకానొక సమయంలో టికెట్ రేట్లను మరీ తగ్గించారు. ఆ సమయంలో సినిమా ఇండస్ట్రీ నుంచి విమర్శలు వ్యక్తమైనా థియేటర్లు మాత్రం కళకళలాడాయనే సంగతి తెలిసిందే. జగన్, కేసీఆర్ లను సినిమా వాళ్లు విమర్శించినా సామాన్యులు మాత్రం విమర్శించలేదు.
 
సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లకు జగన్, కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రులే కరెక్ట్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. పెద్ద సినిమాల టికెట్ రేట్లు ఇష్టానుసారం పెరగడం వల్ల సినిమాలకు కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువని చెప్పవచ్చు. అయితే నిర్మాతలు మాత్రం ఈ విషయాలను అస్సలు అర్థం చేసుకోకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం.
 
ఒక నిర్మాత ఒక పెద్ద సినిమా కోసం 1500 రూపాయలు ఖర్చు చేయలేరా అంటూ చేసిన కామెంట్ల విషయంలో సామాన్య ప్రజలు నిర్మాతను ఏకిపారేస్తున్నారు. మరో నిర్మాత 20 రూపాయలకు అయినా ఇడ్లీ దొరుకుతుందని 200 రూపాయలకు అయినా ఇడ్లీ దొరుకుతుందని టికెట్ రేట్ల గురించి ప్రస్తావిస్తూ చెబుతున్నారు. కానీ పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో నగరాలకు, పల్లెటూళ్లకు పెద్ద తేడా అయితే లేదనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీ నిర్మాతలు అత్యాశకు పోకుండా రెమ్యునరేషన్లు, బడ్జెట్లను అదుపులో ఉంచితే మాత్రమే ఈ పరిస్థితి మారే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. నిర్మాతల తీరు మారకపోతే మాత్రం నష్టపోయేది ఇండస్ట్రీ అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు.






మరింత సమాచారం తెలుసుకోండి: