* టికెట్ల ధర పెంపుతో సామాన్యుడి జేబుకు చిల్లు
* ఒక్కో సినిమా టికెట్‌ ధర రూ.1500
* రూ.50 పెడితేనే..సామాన్యుడు వెళ్లే పరిస్థితులు
* పెద్ధ హీరో అయినా...టికెట్‌ ధరలు తగ్గించాల్సిందే



టాలీవుడ్ ఇండస్ట్రీలో... రకరకాల సినిమాలు వస్తున్నాయి. ఇందులో పెద్ద హీరోలు అలాగే చిన్న హీరోల సినిమాలు కూడా ఉంటున్నాయి. అయితే కొన్ని.. సినిమాలు పాన్ ఇండియా పేరుతో రిలీజ్ అవుతున్నాయి. కథలో దమ్ము లేకున్నా... పాన్ ఇండియా పేరుతో సినిమాలు కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే పాన్ ఇండియా సినిమా కావడంతో..  జనాలు కూడా వేలకు వేలు పెట్టి... టికెట్స్ కొని సినిమా థియేటర్లకు వెళ్తున్నారు.


అయితే సినిమాలకు వెళ్లిన ప్రేక్షకులు... దారుణంగా మోసపోతున్నారని...  స్వయంగా వాళ్లే చెబుతున్నారు. 1500 రూపాయలు ఒక్కో సినిమా టికెట్ ధర పెట్టి.. థియేటర్కు వెళ్తే తమకు... బూడిద మిగులుతోందని ఆగ్రహిస్తున్నారు. ఎక్కువ బడ్జెట్ పెట్టడం ఎందుకు... ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడం  ఎందుకు..? తక్కువ రెమ్యూనరేషన్తో... హీరోలు సర్దుకు పోలేరా..? అని మండిపడుతున్నారు.


తక్కువ బడ్జెట్లో సినిమాలు చేస్తే సామాన్యుడు కూడా ఖచ్చితంగా థియేటర్కు వచ్చి... సినిమా చూస్తాడని చెబుతున్నారు. 50 రూపాయల నుంచి టికెట్ ధరలు ప్రారంభిస్తే... బాగుంటుందని కూడా కొంతమంది కోరుతున్నారు. లేదు ఇలాగే ఒక్కో సినిమా టికెట్ 1500 రూపాయల నుంచి పై మాటే ఉంటుందంటే... థియేటర్లు మూసుకోవాలని... ఫ్యాన్స్ ఆగ్రహిస్తున్నారు.


మీ పాన్ ఇండియా సినిమాలను థియేటర్లో కంటే...OTT, ఐ బొమ్మ, మూవీ రూల్స్  ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫ్లాట్ ఫార్మ్ లలో ....చూస్తామని ఫ్యాన్స్ అంటున్నారు. అవసరమైతే టీవీలో వచ్చేదాకా వెయిట్ చేస్తామని కూడా చెబుతున్నారు కొంతమంది.  కానీ ఈ డబ్బా సినిమాల కోసం పదిహేను వందల రూపాయలు... వృధా చేయబోమని చెబుతున్నారు. ఇకనైనా రెమ్యూనరేషన్ హీరోలు తగ్గించుకోవాలని హెచ్చరిస్తున్నారు. మంచి కథ, తక్కువ బడ్జెట్ తో సినిమాలు రావాలని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: