ఒకప్పటికి ఇప్పటికీ సినిమా తీరు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో అనే భయం దర్శక నిర్మాతల్లో ఉండేది. ఈ విషయంపై హీరోలు కూడా తెగ భయపడిపోయేవారు. కానీ ఇప్పుడు ప్రేక్షకులకు నచ్చడం మాట పక్కన పెడితే వసూళ్లు వస్తాయా.. పెట్టిన పెట్టుబడికి మించిన లాభాలు వస్తాయా.. అనే ఆలోచన ప్రతి దర్శక నిర్మాతలు హీరోలకు పెరిగిపోయింది. దీంతో నేటితరం సినిమా ఇండస్ట్రీలో ప్రేక్షకుడు అనేవాడు కేవలం ఒక ఆట బొమ్మగా మారిపోయాడు అనేది  జరుగుతున్న పరిస్థితులను చూస్తూ ఉంటే అందరికీ అర్థమవుతుంది.


 ఒక రకంగా చెప్పాలంటే సామాన్యుడికి సినిమా భారమైపోయింది. ఇలా భారమై చివరికి దూరమైపోయింది. దీంతో ఇక ఇప్పుడు సామాన్యులు సినిమా చూడాలి అంటే ఐబొమ్మ లాంటి పైరసీ వెబ్సైట్లే దిక్కు అయిపోయాయి పేదోడికి. ఎందుకంటే ఏదో ఒక రోజు హాలిడే వస్తే చాలు సంతోషంగా ఫ్యామిలీ అందరితో కలిసి సినిమా థియేటర్కు వెళ్లి కొత్త సినిమా చూడాలనుకుంటాడు ప్రేక్షకుడు. కానీ నిర్మాతలు ఇక ఇష్టరీతిన పెంచేస్తున్న టిక్కెట్ రేట్లతో సామాన్యుడు థియేటర్ కు వెళ్లాలంటేనే భయపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఒక్కరోజు సినిమా చూసే డబ్బులతో నెల మొత్తం సరుకులు వస్తాయి కదా.. ఎందుకు మన మధ్య తరగతి జీవితానికి ఇంత ఖర్చు అని వెనకడుగు వేస్తున్నాడు.


 అయితే ఒకవైపు ఆర్థిక పరిస్థితులు భయపెడుతూ.. టికెట్ రేట్లు బెంబేలెత్తిస్తుంటే.. సినిమా చూడటం కోసం సామాన్యుడు ప్రత్యామ్నయం గురించి చూస్తున్నాడు. అందుకే థియేటర్కు వెళ్లి చూడాల్సిన సినిమాను ఐ బొమ్మ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకుని చూసేస్తున్నాడు. ఎందుకంటే కనీసం ఓటీటిలో రిలీజ్ అయిన తర్వాత చూడాలి అన్న అటు ఓటిటి ప్లాట్ ఫామ్స్ కూడా తమ సబ్స్క్రిప్షన్ ధరలను భారీగా పెంచేస్తూ ఉన్నాయి. ఇలా ఒకవైపు థియేటర్ కి వెళ్లాలన్న.. ఇంకోవైపు ఓటీటిలో చూద్దామన్న ఎటు పోయి అటు సామాన్యుడు జోబుకు చిల్లుపడే పరిస్థితి ఉంది.



అందుకే మనసు ఒప్పక పోయినప్పటికీ చివరికి.. సామాన్యుడికి ఐ బొమ్మ దిక్కు అయిపోయింది. దీంతో టికెట్ రేట్లకు భయపడి వెనకడుగు వేసిన ప్రతి సామాన్యుడు అయి బొమ్మ వైపుచూస్తూ ఉన్నారు. దీనికి అంతటికి కారణం ఎవరు భారీగా టికెట్ ధరలను పెంచేస్తున్న నిర్మాతలు. ఎప్పుడైతే నిర్మాతలు ప్రేక్షకుడి గురించి ఆలోచించడం మొదలు పెడతాడో.. అప్పుడే మళ్ళీ ప్రేక్షకుడు థియేటర్లో సినిమాలను చూడడం గురించి ఆలోచిస్తాడు అనే భావన ప్రస్తుతం ప్రతి సామాన్యుడి మనసులో మెదులుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: