దాదాపుగా 25 సంవత్సరాల క్రితం టైర్2, టైర్3 ఏరియాలలో సినిమా టికెట్ రేట్లు 5 రూపాయల నుంచి 10 రూపాయల రేంజ్ లో ఉండేవి. ఆ సమయంలో ఆ టికెట్ రేట్లనే ఎక్కువ మొత్తం అని ఫీలయ్యేవారు. మగధీర సినిమా రిలీజ్ సమయానికి టికెట్ రేట్లు 60 రూపాయలు, 40 రూపాయలుగా ఉండేవి. 2015 సమయంలో టికెట్ రేటు 70 రూపాయలకు చేరింది. హైదరాబాద్ లోని ప్రముఖ థియేటర్లలో టికెట్ రేటు ఇంతే ఉండేది.
 
అయితే గత కొన్నేళ్లలో టికెట్ రేట్లు మాత్రం అడ్డూ అదుపు లేకుండా పెరిగాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నిర్మాతలు సైతం పెంచిన టికెట్ రేట్లను సమర్ధించుకోవడానికి ఇష్టానుసారం కామెంట్లు చేస్తున్నారు. అయితే 5 రూపాయల టికెట్ రేట్లు పెడితే తప్ప నిర్మాతల పొగరు, గర్వం తగ్గదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందరు నిర్మాతలు కాదు కానీ కొంతమంది నిర్మాతలు తలపొగరుతో మాట్లాడుతున్నారనే కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తుండటం గమనార్హం.
 
నిర్మాతలు తాము తొలిరోజే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధించాలనే స్వార్థంతో వ్యవహరిస్తున్న తీరు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పెద్ద సినిమాల నిర్మాతలు, చిన్న సినిమాల నిర్మాతలు తమ సినిమాలకు టికెట్ రేట్లను భారీగా పెంచడం వల్ల సినిమాలు ఫస్ట్ వీకెండ్ పూర్తైన వెంటనే కలెక్షన్లు లేక భారీ నష్టాలను మిగులుస్తున్నాయి.
 
కొన్ని థియేటర్లకు కనీసం కరెంట్ ఖర్చులు, మెయింటనెన్స్ ఖర్చులు సైతం రాని పరిస్థితి నెలకొంది. నిర్మాతాల అత్యాశ వల్ల కొన్ని థియేటర్లు గోడౌన్ లుగా, మరికొన్ని థియేటర్లు కళ్యాణ మండపాలుగా మారుతున్నాయి. రాబోయే రోజుల్లో అయినా ఈ పరిస్థితి మారుతుందేమో చూడాల్సి ఉంది. నిర్మాతల తీరు మారకపోతే మాత్రం సినిమా ఇండస్ట్రీ తీవ్రస్థాయిలో నష్టపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. పెద్ద సినిమాల నిర్మాతలు టికెట్ రేట్లు పెంచి సినిమాలను చంపేసుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: