‘దేవర’ మూవీకి వచ్చిన డివైడ్ టాక్ తో ఆమూవీని కొనుక్కున్న బయ్యర్లు నష్టాల బాట పట్టకుండా కనీసపు లాభాలతో అయినా బయట పడగలరా అన్న సందేహాలకు ‘దసరా’ రేసుకు విడుదలైన సినిమాలు అన్నీ అంతంత మాత్రంగా మిగిలి పోవడంతో పండుగ రోజులలో భారీ సినిమాలను చూడాలాని ఆశపడ్డ సగటు ప్రేక్షకులకు ‘దేవర’ మూవీ సమాధానంగా దొరకడంతో తెలుగు రాష్ట్రాలలో ఈమూవీ ప్రదర్శింప బడుతున్న ధియేటర్లలో గడిచిన వీకెండ్ కలక్షన్స్ పరంగా ‘దేవర’ కు సహాయం చేసింది అన్న కామెంట్స్ వస్తున్నాయి.



వాస్తవానకి ‘దసరా’ సీజన్ కు చాల సినిమాయలు వచ్చినప్పటికీ ఆమూవీలకు సరైన టాక్ రాకపోవడంతో టాక్ తో సంబంధం లేకుండా ‘దేవర’ బయ్యర్లు లాభాల బాట పట్టారు అంటూ లీకులు వస్తున్నాయి. ఇక ‘దసరా’ సినిమాల పరిస్థితి విశ్లేషణ చేస్తే ఏఒక్క సినిమా టోటల్ పాజిటివ్ టాక్ రాకపోవడం కొంతవరకు షాకింగ్ గా మారింది. సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ మూవీ మొదటిరోజు నుండి ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది.



పండుగకు విడుదలైన సినిమాలలో ఎవరు ఊహించని విధంగా సుహాస్ నటించిన ‘జనక అయితే గనక’ కొంతవరకు గట్టెక్కగలిగింది అని అంటున్నారు. ‘దసరా’ రేస్ మూవీలలో విడుదలైన గోపీ చంద్ ‘విశ్వం’ మూవీ ఫెయిల్ అయినట్లు సంకేతాలు వచ్చినప్పటికీ గోపీచంద్ ‘విశ్వం’ తెలుగు రాష్ట్రాలలోని మాస్ ప్రేక్షకులకు నచ్చడంతో ఈమూవీ కలక్షన్స్ ఊహించిన స్థాయిలో లేవు అన్న అభిప్రాయాలు వ్యక్తం అయినప్పటికీ ఈమూవీ కలక్షన్స్ ‘దసరా’  సీజన్ లో ఫర్వాలేదు అని వార్తలు వస్తున్నాయి.



ఇక దిల్ రాజ్ ఎన్నో ఆశలు పెట్టుకుని విడుదల చేసిన ‘జనక అయితే గనక’ కలక్షన్స్ అంతంతమాత్రంగానే ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల నుండి వార్తలు వస్తున్నాయి. రజనీకాంత్ ‘వేట్టయన్ ది హంటర్’ పరిస్థితి కూడ ఆశాజనకంగా లేడు అని అంటున్నారు. సుధీర్ బాబు ‘మానాన్న సూపర్ హీరో కన్నడ డబ్బింగ్ మార్టిన్’. అలియా భట్ ‘జిగ్రా’ ఫ్లాపుల లిస్టులో చెరిపోయాయి అని అంటున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: