హీరో సుధీర్ బాబు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పుష్కరకాలం దాటిపోయినా ఇప్పటివరకు సరైన హిట్ అందుకోలేకపోయాడు. మహేష్ బావగా ఇండస్ట్రీలో అదేవిధంగా మహేష్ అభిమానులలో గుర్తింపు ఉన్నప్పటికీ అదృష్టం అతడి తలుపు తట్టడంలేదు. మంచి నటుడుగా గుర్తింపు పొందినప్పటికీ అతడి సినిమాల ఎంపికలో ఒకదానికి మరోదానికి సంబంధం లేకుండా ప్రయోగాలు కమర్షియల్ సబ్జెక్ట్ ల ఎంపికలో పొరపాట్లు అతడి కెరియర్ ను కన్ఫ్యూజ్ చేస్తూ కస్టాలలోకి నెట్టేస్తోందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.



లేటెస్ట్ గా ‘దసరా’ కు విడుదలైన ‘మానాన్న సూపర్’ మూవీకి మంచి రివ్యూలు వచ్చినప్పటికీ ఆసినిమాకు ‘దసరా’ పండుగ సీజన్ లో కూడ కనీసపు కలక్షన్స్ రాకపోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. అతడి సినిమాలకు కనీసపు స్థాయిలో కూడ ఓపెనింగ్స్ రాకపోవడంతో పాటు మహేష్ బాబు అభిమానిలు కూడ ఇతడి సినిమాల వైపు చూడకపోవడం కొసమెరుపు.



హీరో హీరోయిన్ చనిపోయే క్లైమాక్స్ ఉన్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీ ప్రయోగానికి ప్రేక్షకులు అంగీకరించలేదు. ఆమధ్య విడుదలఅయిన ‘హరోం హర’ మాత్రమే కొంతవరకు కలక్షన్స్ ను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం అతడు నటిస్తున్న ‘జటాధర’ పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది. ఈతరం ప్రేక్షకులు ఫాంటసీ జానర్ సినిమాలను ఇష్టపడుతున్నారు కాబట్టి ఈమూవీ పై ఇతడు చాలఆశలు పెట్టుకున్నాడు.



త్వరలో ఇతడి కొడుకుని హీరోగా చేయాలని ఆశ పడుతున్న ఇతడి ప్రయత్నాలు ఎంతవారకు సక్సస్ అవుతాయో రాబోయే కాలం తెలియచేస్తుంది. సుధీర్ బాబు ముందు తాను హీరోగా బలంగా స్థిరపడితే ఆతరువాత అతడి వారసుడికి సరైన అవకాశాలు వచ్చే ఆస్కారం ఉండీ. ప్రస్తుతం అతడి కెరియర్ నిలబడాలి అతడికి ఒక బ్లాక్ బష్టర్ హిట్ తప్పనిసరి. మరి అలాంటి హిట్ ఇవ్వగల మూవీ దర్శకుడు అతడికి ఎప్పుడు ఎదురు అవుతాడు అన్నది సమాధానం లేని ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల మధ్య సుధీర్ బాబు కెరియర్ కన్ఫ్యూజన్ లో ఉంది అనుకోవాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: