టాలీవుడ్ లో ఇటీవల కాలంలో పరిస్థితి ఎంత దారుణంగా తయారయింది అంటే చాలా హిట్ సినిమాలకు కూడా లాభాలు రాని పరిస్థితి. సినిమా తీసిన నిర్మాత దగ్గర నుంచి సినిమా ఏరియాల వారీగా కొన్న డిస్ట్రిబ్యూటర్లు ... థియేటర్లలో ప్రదర్శించే ఎగ్జిబిటర్లు ఎవరికి రూపాయి లాభం రావడం లేదు .. కానీ పోస్టర్లలో కోట్లకు కోట్లు కలెక్షన్లు వచ్చినట్టు లెక్కలు చూపించుకుంటున్నారు. మా సినిమాకు రు. 100 కోట్లు వచ్చాయని చెప్పుకుంటున్నారు. సినిమా తీసిన నిర్మాతతో పాటు సినిమా కొన్న ఎవరికి లాభాలు రాని సినిమా ఎలా హిట్ సినిమా ? అవుతుందో వాళ్లకే తెలియాలి.. కేవలం అంకెల గారి మాయమాటలు చెప్పి సినిమా అమ్ముకుని సొమ్ము చేసుకోవడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు తప్ప తమ ప్లాప్ సినిమాను కూడా హిట్ అని చెప్పుకుంటూ ప్రకటనలు సోషల్ మీడియాలో కవర్ చేసుకుంటున్నారు తప్ప ఆ సినిమా వల్ల ఎవరికి ఉపయోగం లేదు అన్నది వాస్తవం.
ఇలా అన్ని సినిమాలను విమర్శించడం సరికాదు కొన్ని సినిమాలు కథాబలం ఉండి కూడా రాంగ్ టైంలో రిలీజ్ కావటం వల్ల లేదా ... ఎక్కడో జరిగిన చిన్న చిన్న లోపం వల్ల అనుకున్న స్థాయిలో వసూళ్లు సాధించలేకపోవచ్చు కానీ చాలా సినిమాలకు కలెక్షన్ల మాయలు ... అంకెల గారడీలు జరుగుతున్నాయి. అసలు టైర్ 2 స్టార్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు చాలా మంది హీరోల సినిమాలకు అస్సలు లాభాలు రావడం లేదు.. కొందరు అయితే నష్టం వస్తుందని తెలిసి కూడా వ్యాపారం లో తాము ముందుండలాలనో లేదా తమ థియేటర్లకు కనీసం ఫీడింగ్ ఉండాలనో బోల్డు బోల్డు డబ్బు పోసి సినిమాలు కొంటున్నారు. తీరా ఫలితం చూసి.. డబ్బులు పోగొట్టుకుని చేతి చముదు వదిలాక కాని వాళ్లకు పరిస్థితి తెలిసి రావడం లేదు... ఏదేమైనా హీరో మార్కెట్... ఆ హీరో గత సినిమాల వాస్తవ కలెక్షన్ల ఆధారంగానే సినిమాల అమ్మకాలు.. కొనుగోళ్లు జరగనంత వరకు ఈ పరిస్థితి మారదు.