టాలీవుడ్ లో పైనుంచి కిందిస్థాయి వరకు జరిగేది అంతా మోసమే .. ఈ మోసం ప్రతి స్థాయిలోనే జరుగుతుంది. ఒక సినిమాకు అయిన ఖర్చు ఎంత ?అన్నది లెక్క చెప్పే విషయంలో చాలామంది నిర్మాతలు అంకెలు గారడీ చేసి మోసం చేస్తూ ఉంటారు. సినిమాకు 150 నుంచి 200 కోట్లు అయిందని చెబుతూ ఉంటారు.. వాస్తవంగా చూస్తే సినిమా నిర్మాణ వ్యయం చాలా తక్కువగా ఉంటుంది. అందులో హీరో - దర్శకుడి రెమ్యూనరేషన్ దాదాపు 60 నుంచి 70 శాతం వరకు ఉంటాయి. హీరోల రెమ్యూనరేషన్లు .. దర్శకులు .. హీరోయిన్లు ఇతర సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు కోట్లలో చూపించేస్తున్నారు. సినిమా నిర్మాణ వ్యయం చాలా తక్కువగా ఉంటుంది. అయితే భారీ బడ్జెట్ సినిమా అని నిర్మాతలు ... డిస్ట్రిబ్యూటర్లకు ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు. అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎగ్జిబిటర్లకు చాలా భారీరేట్లకు అమ్మేస్తున్నారు. సినిమా హిట్ అయ్యి లాభాలు వచ్చిన 10 శాతం నుంచి ఉండటం లేదు. ఉదాహరణకు ఇటీవల వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాకు 300 కోట్ల భారీ బడ్జెట్ అయిందని ప్రచారం జరిగింది. ఎంత సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమాకు ఇప్పటివరకు వచ్చిన లాభాలు 50 కోట్లకు కాస్త అటు ఇటుగా ఉన్నాయి.
ఎంతో పెద్ద హిట్ పడితే తప్పా ఈ స్థాయిలో లాభాలు రావడం లేదు. సంవత్సరం మొత్తం మీద సినిమాల సక్సెస్ రేటు 10 శాతం మించడం లేదు. అసలు ఎన్ని సినిమాలు తీసుకుని.. పంపిణీ చేసి.. ఎన్ని సినిమాలు థియేటర్లలో ప్రదర్శించి.. ఎన్ని లక్షలు నష్టపోతే తప్పా అందులో చాలా తక్కువ హిట్ సినిమాలు రావడంతో తక్కువ మొత్తంలో రికవరీ జరుగుతోంది. యేడాదంతా సినిమా వ్యాపారం చేస్తోన్న డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లు అందరికి భారీ నష్టాలు తప్పడం లేదు. కింద స్థాయిలో ఇంత జరుగుతుంటే... పై స్థాయిలో మాత్రం హీరోల సినిమాలు కోట్లకు కోట్లు రాబట్టేస్తున్నాయంటూ పోస్టర్లు పడిపోతూ ఉంటాయి. అవన్నీ నీటిమీద రాతలే.. గాల్లో మేడలు మాదిరిగానే కనిపిస్తూ ఉంటాయి. మరి కింది స్థాయిలో హిట్ సినిమాలకు కూడా లాభాలు రాక చస్తుంటే... పై స్థాయిలో భారీ రెమ్యునరేషన్లు... కలెక్షన్ల పై గాల్లో మేడలు పెరిగిపోతూ ఉంటాయి.