పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందనే సామెత బాగా పాపులర్ సామెతలలో ఒకటనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితిని చూస్తే ఈ సామెత నూటికి నూరు శాతం కచ్చితంగా సరిపోతుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. బాహుబలి1, బాహుబలి2 సినిమాలతో రాజమౌళి బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేశారనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలు బడ్జెట్ తో పోల్చి చూస్తే భారీ లాభాలను అందించాయనే చెప్పాలి.
 
అయితే ఈ సినిమా సక్సెస్ కావడానికి ప్రభాస్ యాక్టింగ్ స్కిల్స్, రాజమౌళి దర్శకత్వ ప్రతిభ కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ దర్శకనిర్మాతలు మాత్రం జక్కన్నను చూసి వాతలు పెట్టుకుంటున్నారు. ఏ మాత్రం టాలెంట్ లేని దర్శకులతో తల, తోక లేని కథనం అవసరం లేని హంగులను జోడిస్తూ, పాన్ ఇండియా పేరుతో ఇతర భాషల నటులు అవసరం లేకపోయినా నటింపజేస్తూ సినిమాల బడ్జెట్ పెంచేస్తున్నారు.
 
టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ అని చెప్పుకునే ఒక స్టార్ హీరో సినిమా రెండేళ్ల క్రితం థియేటర్లలో విడుదలై ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా నష్టాలను మిగిల్చింది. అదే స్టార్ హీరో సినిమా మైథలాజికల్ టచ్ తో భారీ బడ్జెట్ తో విడుదలై నిర్మాతలు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లను ముంచేసింది. ఒక స్టార్ హీరో ఇండస్ట్రీ హిట్ సాధించిన సినిమా రిలీజైన నెల రోజులకే ఆ హీరో మరో సినిమా విడుదలైంది.
 
ఆ సినిమాకు బాక్సాఫీస్ వద్ద కనీసం 50 కోట్ల రూపాయల కలెక్షన్లు సైతం రాకపోవడం కొసమెరుపు. ప్రతి డైరెక్టర్ జక్కన్న అయిపోవాలని ప్రతి హీరో పాన్ ఇండియా హీరో అయిపోవాలని కలలు కనడంలో తప్పు లేదు. అయితే ఆ కలలు ఎంతవరకు నిజమవుతాయని ఆ కలలు నెరవేర్చుకోవడానికి ఎంతమేర కష్టపడాలనే విషయాలను మరిచిపోతున్నారు. అభిమానులు సైతం పిచ్చి సినిమాలను ప్రోత్సహించే తీరును మార్చుకోవాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: