సినిమాలే చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ అని రూ .1500 పెడితేనే నలుగురు కలిసి సినిమా ఎంజాయ్ చేయవచ్చు అంటూ మరెక్కడైనా మూడు గంటల పాటు రూ .1500 రూపాయలకే ఎంజాయ్ చేసేలా ఉంటుందా అంటూ తెలియజేశారు. దీంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమ పైన చాలామంది ప్రేక్షకులు పెదవి వివరిస్తున్నారు. మరి కొంతమంది మాత్రం అసలు సినిమా టికెట్ల రేట్లు పెంచితే ఉపయోగమా లేకపోతే తగ్గితే ఉపయోగమా అనే విషయాన్ని ఎవరైనా ఆలోచించారా అంటూ తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్రేక్షకులు థియేటర్లకు రావడమే చాలా గగనంగా మారిపోయినది.
బడ బడ్జెట్ మూవీలు, బారి హిట్ టాక్ వస్తే తప్ప ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి మక్కువ చూపలేదు.. వీటికి తోడు ఓటీటీలోకి నెల రోజులలోపే సినిమాలు వచ్చేయడంతో థియేటర్ల కంటే ఓటీటీలో చూడడానికి చాలామంది మక్కువ చూపుతున్నారు. పెద్ద సినిమాలకు ఎలాగో వస్తాయి కనుక వీటి వల్ల చిన్న సినిమాలకు భారీ దెబ్బ పడుతోంది. అది కూడా సినిమా టాక్ సూపర్ అని వస్తేనే ప్రేక్షకులు చూడడానికి వెళ్తున్నారు..టికెట్ల రేటు తగ్గించి అమ్మిన కూడా ప్రేక్షకులు చూడడానికి మక్కువ చూపడం లేదట. ఒక కుటుంబం సినిమా థియేటర్ కి వెళ్లాలంటే రూ. 2000 రూపాయలు ఖర్చవుతుంది.. అయితే ఇంత డబ్బులు పెట్టడం కంటే ఇంటికి అవసరమయ్యే సరుకులు లేదా మరి ఇతరత్రా వస్తువులను తీసుకోవడానికి మక్కువ చూపుతున్నారు. అంతేకాకుండా కొంతమంది చాలా తక్కువగా ఉండే ఓటీటీలను తీసుకొని మరి చూస్తూ ఉన్నారు. దీంతో ఇంటిల్లిపాది చాలా తక్కువ బడ్జెట్ తోనే చూస్తూ ఉండే అభిప్రాయం ఏర్పడింది. మొత్తానికి సినిమా టికెట్లు రేటు పెంచిన తగ్గించిన కొన్ని కొన్ని సినిమాలు అయితే ప్రేక్షకులు చూస్తున్నారు తప్ప మరే సినిమాలను చూడడం లేదు.. ఇలాగే కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా థియేటర్లు మూతపడడం కూడా కాయమే అని చెప్పవచ్చు.ఇలాంటి సమయంలోని నిర్మాతలు టికెట్ల రేటును పెంచితే ప్రేక్షకుల థియేటర్లకు వస్తారు అనుకున్నప్పటికీ.. పెట్టిన పెట్టుబడి మాత్రం రాదనే విధంగా అనుమానాలను తెలియజేస్తున్నారు. టికెట్ల రేట్ల విషయంలో నిర్మాతలు చాలా గందరగోళానికి గురవుతున్నారట. ఇలాంటి విషయాలపైన సినీ పెద్దలు ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.