- పేదోడి సినిమాలు జాడేలేవు.?
- సినిమా చూడాలంటే ఆస్తులు అమ్మాల్సిందేనా.?
సాధారణంగా సినీ హీరోలకు విపరీతమైనటువంటి అభిమానులు ఉంటారు. వారి అభిమాన హీరో సినిమా వస్తుంది అంటే ఎప్పటినుంచో చూడాలి చూడాలి అంటూ ఎదురు చూస్తారు. అలా అభిమాన హీరో సినిమా చూడాలనుకున్నటు వంటి ఫ్యాన్స్ కూడా చివరికి టికెట్లు రేట్ల వల్ల చూడలేకపోతున్నారట. ఇక అభిమానుల పరిస్థితి అలా ఉంటే సాధారణ జనాల పరిస్థితి ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఏదైనా వీకెండ్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి సినిమా చూడాలి అనుకుంటే మాత్రం జేబు గుల్లా చేసుకోవాల్సిందే. హీరో రేంజ్ ను బట్టి సినిమా టికెట్ల రేట్లు 3000 నుంచి 5000 వరకు పలుకుతున్నాయి. ఇక ఫ్యామిలీ సినిమాకు వెళ్లాలంటే తప్పనిసరిగా పదివేలకు పైగానే ఖర్చు పెట్టాల్సిందే. సినిమాకు వెళ్లి ఆనందపడాలా చివరికి ఖర్చు అయ్యాయని కొన్ని రోజులపాటు ఏడవాల అనే దుస్థితిలో ఉన్నారు సాధారణ ప్రజలు. అలా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పనిచేసే హీరో హీరోయిన్లు దర్శక నిర్మాతలు వారు తీసుకునే రెమ్యూనరేషన్లు పెంచుకుంటూ, ఆ భారాన్ని పేద ప్రజలపై వేస్తున్నారని అంటున్నారు.