సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సినీ సెలబ్రిటీస్ పై ఎలాంటి చెత్త రూమర్స్ వినిపిస్తున్నాయో మనం బాగా చూస్తున్నాం. మరీ ముఖ్యంగా స్టార్ హీరో - హీరోయిన్స్ లైఫ్ తో సోషల్ మీడియా ఆడేసుకుంటుంది . అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఒక అడుగు ముందుకే వేసింది . కేవలం సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో హీరోయిన్లు డైరెక్టర్లు పైనే కాదు స్టార్స్ కుటుంబంపై కూడా పలు రకాల వార్తల వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా జానీ మాస్టర్ విషయంలో ఎలాంటి వార్తలు మనం వింటున్నామో తెలిసిందే.  అయితే ఇదే మూమెంట్లో స్నేహ రెడ్డి పై సర్కులేట్ అవుతున్న చెత్త రూమర్ పై బన్నీ ఫాన్స్ ఓ రేంజ్ లో మండి పడిపోతున్నారు. 


స్నేహ రెడ్డి ఎందుకు బన్నీ విషయంలో సైలెంట్ గా ఉంటుంది అంటూ అడిగి కడిగి పడేస్తున్నారు. నిజానికి ఈ మధ్యకాలంలో బన్నీ పేరు పై సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ జరిగింది . దానికి కారణాలన్నీ మనకు తెలిసిందే . పొలిటికల్ పరంగా బన్నీ వేలు పెట్టడమే ఆయనకు మైనస్ గా మారిపోయి సోషల్ మీడియాలో ఆయన పేరు ట్రోలింగ్ కి గురయ్యేలా చేసింది. అయితే స్నేహ రెడ్డి మాత్రం ఆ ట్రోలింగ్ పై ఏ విధంగా స్పందించలేదు . నిజానికి వేరే స్టార్ హీరోలు భార్యలు అలా తమ భర్త పై ట్రోలింగ్ జరిగితే ఖచ్చితంగా స్పందిస్తారు . సోషల్ మీడియా వేదికగా ఇచ్చి పడేస్తారు . కానీ స్నేహ రెడ్డి మాత్రం ఆ విషయంలో మౌనంగా ఉండిపోయింది .



దీంతో కొంతమంది బన్నీ ఫ్యాన్స్.. స్నేహారెడ్డి పై నెగిటివ్ గా మాట్లాడడం ప్రారంభించారు. స్నేహారెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉంది..? బన్నీపై అలాంటి చెత్త ట్రోలింగ్ జరుగుతుంటే గమ్మున ఎలా ఉంది ..? అంటూ పలు రకాలుగా మాట్లాడుకున్నారు . అయితే స్నేహ రెడ్డికి బన్నీ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు.  అలాంటి స్నేహారెడ్డి సైలెంట్ గా ఉండడం వెనక ఏదో రీజన్ ఉండే ఉంది అని అనుకున్నారు. కానీ కొంతమంది మాత్రం బన్నీ ఫ్యాన్స్ అంటూ చెప్పుకునే వాళ్ళు కావాలనే స్నేహారెడ్డిని ట్రోల్ చేశారు . అయితే స్నేహ రెడ్డి మాత్రం బన్నీ చెప్పడం కారణంగానే ఎటువంటి విధంగా సోషల్ మీడియాలో రియాక్ట్ అవ్వలేదట . ఈ విషయం ఆలస్యంగా బయటపడింది . అయితే నిజమైన బన్నీ ఫ్యాన్స్ మాత్రం స్నేహారెడ్డి పై హల్ చల్ అవుతున్న చెత్త రూమర్స్ ని ఖండిస్తూ ఎవరైతే ఆలా ట్రోల్ చేస్తున్నారో వాళ్ళను నాశనం అయిపోతారు అంటూ ఘాటుగా శపిస్తున్నారు . ప్రజెంట్ బన్నీ పుష్ప2 షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: