మెగా యంగ్ హీరోల్లో సాయి ధరమ్ తేజ్ ఒకరు. చేసినవి కొన్ని సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ధరమ్ తేజ్ పెళ్లిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. మెగా ఫ్యామిలీలో హీరోలంతా ఓ ఇంటివాళ్లైపోతున్నారు. ఇటీవలే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. వరుణ్ టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి పెళ్లి ఘనంగా జరిగింది.అయితే వరుణ్ పెళ్లి అవ్వగానే... మెగా అభిమానులంతా సాయి ధరమ్ తేజ్ పెళ్లి ఎప్పుడు అంటూ.. సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అన్నా నెక్ట్స్ నువ్వు ఉన్నావు లైన్లో అంటూ.. సాయి ధరమ్ తేజ్ పై కామెంట్లు చేశారు. అయితే గత కొన్నాళ్లుగా ధరమ్ తేజ్ పై రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.సాయి ధరమ్ తేజ్ కూడా లవ్ లో ఉన్నాడని.. టాలీవుడ్‌కు చెందిన హీరోయిన్’తోనే రిలేషన్ షిప్ మెంటైన్ చేస్తున్నాడని.. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకుంటారని..టాక్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని టాక్ నడుస్తుంది. అయితే సాయి ధరమ్ తేజ్ ఓ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ హీరోయిన్ పేరు మెహ్రీన్.. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్, హీరోయిన్ మెహ్రీన్ ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో వీరిద్దరూ కలిసి ‘జవాన్’ సినిమాలో నటించారు. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

“కృష్ణగాడి వీర ప్రేమగాథ” సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ ఫిర్జాదా. ఈ భామ తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టింది. ఆ మధ్య మెహ్రీన్ భవ్య బిష్టోయ్‌తో ప్రేమాయణం నడిపింది. ఆ సమయంలోనే ఆమె తన ప్రియమైన భవ్య బిష్టోయ్‌తో నిశ్చితార్థం చేసుకుంది. అయితే సడన్ గా ఏం జరిగిందో తెలియదు కానీ అతడితో పెళ్లి క్యాన్సిల్ చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది. ఎలాంటి కారణం చెప్పకుండానే భవ్య బిష్టోయ్‌తో పెళ్లి రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఆమె ఓ మెగా హీరోతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ ప్రచారంపై ఈ జంట ఎలా స్పందిస్తుందో చూడాలి.ఇదిలావుండగా సాయి ధరమ్ తేజ్ పై గతంలో కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి. తన ఫస్ట్ మూవీ పిల్లా నువ్వులేని జీవితం అనే సినిమా హీరోయిన్ రెజీనా కసాండ్రాతో ప్రేమలో ఉన్నాడని టాక్ వచ్చింది. ఇప్పుడు తన జావాన్ మూవీ హీరోయిన్ మెహ్రీన్‌ను పెళ్లి చేసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి వీటిలో ఏది నిజమవుతుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: