అదేంటో కాని సినిమా ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగిన వారంతా సెకండ్ హ్యాండ్ భ‌ర్త‌ల‌నే చేసుకున్నారు. ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఈ లిస్టులో చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ పెళ్ల‌య్యి త‌మ మొద‌టి భార్య‌ల‌ను వ‌దిలేసి ఆ త‌ర్వాత సెకండ్ హ్యాండ్ భార్య‌లుగా వెళ్లిన స్టార్ హీరోయిన్ల లిస్టు చూద్దాం. డ్రీమ్ గ‌ర్ల్ ... బాలీవుడ్ సీనియ‌ర్ న‌టీమ‌ణి హేమ మాలిని వివాహితుడిని వివాహం చేసుకుంది. అలాగే త‌న అంద‌చందాల‌తో దేశాన్నే ఊపేసిన మ‌న తెలుగు అమ్మాయి... దివంగ‌త అతిలోక అందాల సుంద‌రి శ్రీ దేవి వివాహితుడిని వివాహంచేసుకుంది. అప్ప‌టికే పెళ్ల‌య్యిన బోనీక‌పూర్ మాయ‌లో ప‌డిన శ్రీదేవి అత‌డి జీవితంలోకి రెండో భార్య‌గా వెళ్లింది.


ఇక బాలీవుడ్ అందాల సుంద‌రి.. ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ వివాహితుడైన బాలీవుడ్ ఫేమ‌స్ డిస్ట్రిబ్యూట‌ర్ అనిల్ త‌డానీని వివాహం చేసుకుంది. కరీనా కపూర్ వివాహితుడైన సైఫ్ ఆలీఖాన్‌ను వివాహం చేసుకుంది. అత‌డు త‌న మొద‌టి భార్య అమృతాసింగ్‌కు విడాకులు ఇచ్చాడు.
ఇర కరీనా కపూర్ అక్క క‌రిష్మా క‌పూర్ కూడా వివాహితుడిని వివాహం చేసుకుంది. ఇక తెలుగులో నాగార్జున విక్కిదాదా సినిమాలో చేసిన జూహి చావ్లా కూడా వివాహితుడిని వివాహం చేసుకుంది. ఇక ద డ‌ర్టీ పిక్చ‌ర్ సినిమాలో త‌న అంద చందాల‌తో దేశాన్నే ఊపేసిన విద్యాబాలన్ వివాహితుడిని వివాహం చేసుకుంది. ఇక బాలీవుడ్ ముద్దు గుమ్మ‌లు అయిన సోనమ్ కపూర్  - లారా దత్తా కూడా వివాహితుడిని వివాహం చేసుకున్నారు.


అలాగే సీనియ‌ర్ హీరోయిన్ పొడుగు కాళ్ల సుంద‌రి శిల్పా శెట్టి అప్ప‌టికే వివాహితుడైన రాజ్ కుంద్రాను వివాహం చేసుకుంది. అలాగే మహిమా చౌదరి -
అమృత అరోరా - రాణి ముఖర్జీ - బిపాషా బసు - సారికా - షబానా అజ్మీ - కల్కి కోచ్లిన్ - స్మితా పాటిల్ కూడా వివాహితులై.. విడాకులు తీసుకున్న వారినే వివాహం చేసుకుని త‌మ భ‌ర్త‌ల‌కు రెండో పెళ్లాలుగా వెళ్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి: