కథలో దమ్ములేకపోవడం.. శ్రీను వైట్ల మార్క్ వింటేజ్ కామెడీ రొటీన్‌గా అవ్వడంతో విశ్వం బాక్సాఫీస్ దగ్గర రొటీన్ ముద్ర వేయించుకుంది. ఇక సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో సినిమా ఓ ఎమోషనల్ కథతో తెరకెక్కింది. ఇది ఓటీటీ టైప్ సినిమా అని.. ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయడం కరెక్ట్ కాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇక బాక్సాఫీస్ విజయం కోసం ఎదురుచూస్తున్న సుహాస్ ఈ సారి జనక అయితే గనక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు సరైన ప్రమోషన్స్ లేవు. ఇక సుహాస్ గత చిత్రం ‘గొర్రె పురాణం’ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలడంతో ఆ ప్రభావం కూడా ఈ సినిమా బాగా పడింది.
ఇక బలగం లాంటి బ్లాక్‌బస్టర్ అందించిన దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న సినిమా అయినా, కథలో ఆకట్టుకునే అంశాలు లేక నిరాశపరిచింది. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ జిగ్రా - కన్నడ హీరో ధృవ సర్జా మార్టిన్ తెలుగులో పెద్దగా బజ్ లేకుండా దసరా బరిలోకి వచ్చాయి. ఇక ఎన్టీఆర్ దేవర మూడో వారంలో బాక్సాఫీస్ దగ్గర స్టడీగా రన్ అవుతోంది. ఫైనల్ గా చెప్పాలంటే దసరా బరిలో వచ్చిన సినిమాలు అన్నింటిలో గోపీచంద్ ఇమేజ్‌తో పాటు 30 ఇయర్స్ పృథ్వీ కామెడితో కాస్తోకూస్తో విశ్వం సినిమాకే యావరేజ్ గా అయినా ప్రేక్షకులు ఓట్లేశారు.