- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .


టాలీవుడ్ పరిస్థితి ఎలా వచ్చేసింది అంటే సామాన్యుడు దిగువ .. మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడాలంటేనే బెంబేలెత్తే పరిస్థితి వచ్చింది .. అలా అనడం కంటే అలా తీసుకువచ్చారు అని చెప్పాలి. ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతోంది అంటే చాలు ప్రభుత్వాల దగ్గర అదనపు షోలు ... అర్ధరాత్రి షో లు ... బెనిఫిట్ షోలు ... ప్రీమియర్ షోలు అని పర్మిషన్లు తెచ్చుకోవడం తోపాటు టిక్కెట్ రేట్లు భారీగా పెంచేసి సామాన్యుడు జేబు గుల్ల గుల్ల చేసి సామాన్యుడు జేబుకు చిల్లు పెట్టి వదిలేస్తున్నారు. ఒక్కో టిక్కెట్టు 500 రూపాయలకు కౌంటర్ లోనే అమ్ముతున్నారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. టాలీవుడ్ జనాల దోపిడీ ఏ స్థాయిలో ఉందో క్లియర్గా తెలుస్తోంది. ఈ విషయంలో ఒకరిద్దరిని పక్కన పెడితే మెజార్టీ ఇండస్ట్రీ జనాలు ప్రేక్షకుడిని దోచుకుని ... ప్రేక్షకుల జేబు గుల్ల చేసేందుకు ఎంత మాత్రం వెనకాడటం లేదు.


ఇందుకు ప్రభుత్వాలు కూడా అనుమతులు ఇచ్చేయటం మరి దారుణం అని చెప్పాలి . సామాన్యుడిని ఇండస్ట్రీ వాళ్ళు దోచుకుని తింటూ ఉంటుంటే ప్రభుత్వాలు వంతపడటం బాధాకరం. పోనీ టిక్కెట్ రేట్లు ఆ స్థాయిలో ఉన్న అందుకు తగినట్టుగా వినోదం ఉందా అంటే నాసిరకం వినోదం ... నాసిరకం కథలు ... నాసిరకం సినిమాలు ప్రేక్షకుల మీదకు వదులుతూ వాళ్ళు మాత్రం దోపిడీలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. థియేట‌ర్ల లో స్టార్ హీరోల సినిమాల్లో ఉంటోన్న కంటెంట్ కంటే వెబ్ సీరిస్ లు.. ఓటీటీ లో వ‌స్తోన్న వే మంచి క‌థా బ‌లంతో క‌నిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు చాలా మంది సినిమాల ను చూసేందుకు థియేట‌ర్ల‌కు వెళ్ల‌డం కంటే ఓటీటీ లు.. వెబ్ సీరిస్ ల‌కు అల‌వాటు ప‌డుతున్నారు. ఏదేమైనా మ‌న ఇండ‌స్ట్రీ వాళ్లు దోపిడి ప‌క్క‌న పెట్టేసి... మంచి కంటెంట్ మీద కాన్‌సంట్రేష‌న్ చేస్తే త‌ప్పా థియేట‌ర్ల‌కు... మ‌నుగ‌డ ఉండ‌దు.

మరింత సమాచారం తెలుసుకోండి: