టాలీవుడ్ లో హీరో ల తీరు మారిపోతుంది .. వరుస గా నాలుగైదు డిజాస్టర్ సినిమాలు ఇచ్చిన ఒక్క హిట్ సినిమా వస్తే చాలు హీరోలు రెమ్యూనరేషన్ అమాంతం పెంచేస్తున్నారు .. అదే ఒకటి రెండు సినిమాలు హిట్ అయితే వారిని పట్టుకోవటం అసాధ్యం అన్నట్టుగా ఉంది .. అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక మాదిరి నిర్మాత కనీసం టైర్ 2 హీరోల తో సినిమాలు తీసేందుకు కూడా సాహసించని పరిస్థితి ఆ స్థాయిలో హీరోల రెమ్యూనరేషన్లు పెరిగిపోతున్నాయి . పదిఏళ్ళా క్రితం ఎప్పుడో ఒక హిట్ వచ్చిన హీరో రెమ్యూనరేషన్ ఇప్పుడు ఏకంగా రూ. 10 కోట్ల పైనే ఉంది .. వరుసగా హిట్లు కొడుతున్నాను అని చెప్పుకుంటున్న ఒక టైర్ 2 స్టార్ హీరో గత ఏడు , ఎనిమిది సినిమాలకు సినిమా కొన్న వాళ్ళు ఎవరు లాభాలు కళ్ళజోసిన పరిస్థితి లేదు .
దీనిని బట్టి హీరో లు తమ స్థాయి కి మించి తమ మార్కెట్ ను మించి రెమ్యూనరేషన్ నిర్మాతల దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు . నిర్మాత లు కూడా హీరోల తో సినిమా లు తీసేందుకు పోటీ పడుతూ ఉండడం తో హీరో లు ఆడింది ఆట పాడింది పాట అంతా తమ ఇష్టారాజ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు . కేవలం రెమ్యూనరేషన్ ముద్దు కథ కంటెంట్ వద్దే వద్దు అన్నట్టుగా అస్సలు పట్టించుకోవడం లేదు వీళ్లకు కావాల్సింది కేవలం డబ్బు మాత్రమే డబ్బు మాయిలో పడి సినిమాల సక్సెస్ రేట్ ను తగ్గించేస్తున్నారు .
ఇలా టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు భారీ సక్సెస్ అందుకుని చాలా కాలం అవుతుంది.. బాహుబలి తర్వాత సినిమాల రేంజ్ పెరిగిందని చెప్పటమే ఒకటి తప్ప.. వాటిలో క్వాలిటీ లేకుండా ప్రేక్షకులపై భారం వేస్తూ ఏది పడితే అది చెత్త తీస్తూ థియేటర్లోకి తెస్తున్నారు. ఆ సినిమాలను చూడలేక ప్రేక్షకులు సినిమాలపైనే ఇరత్తి పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలలో ఇద్దరు ముగ్గురు మినహా మిగిలిన హీరోలందరూ ఇదే దారిలో సినిమాలు చేస్తూ చిత్ర పరిశ్రమకు శనిలా దాపరించారు. వీరికి నిర్మాతలు కూడా తందాన పడుతూ ఏది పడితే అది తీస్తూ ప్రేక్షకులు ముందుకు వదులుతున్నారు. ఇక మరి రాబోయే రోజుల్లో అయినా టాలీవుడ్ పరిస్థితి మారుతుందో లేదో చూడాలి.