రీసెంట్ గానే నారా రోహిత్ నిశ్చితార్ధం చేసుకున్నాడు. ప్రతినిధి 2 సినిమాలో ఆయనకు జంటగా నటించిన హీరోయిన్ సిరి తో నిశ్చితార్ధం చేసుకున్నాడు . వీళ్ళ నిశ్చితార్ధం చాలా గ్రాండ్ గా బంధువుల సమక్షంలో జరిగింది . అయితే ఇలాంటి మూమెంట్లోనే నారా రోహిత్ కి సంబంధించిన పాత లవ్ స్టోరీ ఒకటి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది . నారా రోహిత్ ఒక స్టార్ హీరోయిన్ ని ప్రేమించాడు అని .. ఆమె కూడా ఈయనను ప్రేమించింది అని .. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు అని.. కానీ కొన్ని కారణాల చేత వీళ్ళు విడిపోయారు అని వార్తలు వినిపిస్తున్నాయి.
ఆమె మరెవరో కాదు కాజల్ అగర్వాల్ సిస్టర్ నిషా అగర్వాల్ . నారా రోహిత్ - నిషా అగర్వాల్ కాంబినేషన్లో వచ్చిన సినిమా "సోలో". ఈ సినిమా మంచి హిట్ అందుకుంది . వీళ్ళ కెమిస్ట్రీకి కూడా మంచి మార్కులు పడ్డాయి . అప్పటివరకు సైలెంట్ గా కనిపించిన నారా రోహిత్ ఆ సినిమాలో నాటీ బాయ్ గా దర్శనమిచ్చాడు. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ చూసిజంట మధ్య ప్రేమ బాగా ముదిరిపోయింది అనుకున్నారు అంతా . పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ జంట విడిపోయింది అందుకే దూరం దూరంగా ఉంటుంది అంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి . అసలు నిజంగానే నారా రోహిత్ - నిష అగర్వాల్ ను ప్రేమించాడా..? లేకపోతే ఇదంతా సోషల్ మీడియా పుణ్యమా..? ఏమో ఈ వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది..!!