సాయి పల్లవి ఫిట్‌గా ఉండేందుకు రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తుంది. అలాగే ఒక వేళ షూటింగ్ లో ఉన్న కూడా వ్యాయామం మాత్రం కచ్చితంగా చేస్తుందట. ఇటువంటి రోజువారీ వ్యాయామాలు శరీరం ఫిట్ గా ఉంచడమే కాకుండా, ముఖం యొక్క అందాన్ని కూడా పెంచుతుంది. ఇది శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది. వర్కవుట్‌తో పాటు యోగా కూడా రెగ్యులర్‌గా చేస్తుంది. తనకిష్టమైన డ్యాన్స్ కూడా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తుంది. వాస్తవానికి డ్యాన్స్ కూడా మంచి వ్యాయామం.
ఇక సాయి పల్లవి తన చర్మం పొడిబారకుండా హైడ్రేట్ గా ఉంచుకోవడానికి ఎక్కువ మోతాదులో నీళ్లు తాగుతుంది. అంటే... మంచినీళ్లే కాదు... లిక్విడ్ ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకుంటారు. ఇలా చేయడంతో చర్మం ఎల్లప్పుడూ తేమగా ఉండడంతో పాటు , చర్మాన్ని మెరిసేలా కూడా చేస్తుంది.
అలాగే సాయి పల్లవి కెమికల్స్ ఉండే మేకప్ ని అస్సలు ఉపయోగించారట . సినిమా షూటింగ్ కోసం కూడా ఆమె ఎలాంటి మేకప్ వేసుకోదు. ఆమె కేవలం సహజ ఉత్పత్తులు మాత్రమే ఉపయోగించారట డతారట. సహజ ఉత్పత్తులు వాడటం వల్ల చర్మం సహజంగా అందాన్ని కలుగచేస్తుంది. అంతే కాకుండా సాయి పల్లవి కూడా తాను మేకప్ వేసుకోను అని చాలా సందర్భల్లో స్వయంగా చెప్పింది
సాయి పల్లవి అందాన్ని రెట్టింపు చేసే క్రమంలో జుట్టు కూడా ఒకటి . అయితే జుట్టు సంరక్షణకు కూడా ఆమె షాంపూలు, రసాయనాలు కలిగిన షాంపూలు, క్రీములు వాడారు. కేవలం కుంకుమపువ్వు, షేకాకాయ పొడి వంటి సహజసిద్ధమైన ఉత్పత్తులను మాత్రమే వాడుతారట. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం అని సాయి పల్లవి భావన. ఇందుకు ఆమె ఎప్పుడూ కూడా ఆమె తినే ఫుడ్ లో పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకుంటారట. బ్యాలెన్స్డ్ డైట్ మైన్టైన్ చేస్తుదట. ఆ ఫుడ్ కారణంగానే ఆమె సహజంగా అందంగా కనపడుతుండటం విశేషం అని అందరి భావన.