శ్రీ లీల .. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాజ్యం ఏలేస్తుంది అని అంతా అనుకున్నారు . కానీ పాపం ఏ దిష్టి తగిలిందో ఏమో కానీ శ్రీలీల రేంజ్ ఢమాల్ అంటూ పడిపోయింది . పేరుకు కన్నడ బ్యూటీనే అయినప్పటికీ తెలుగులో మంచి స్టార్ డంస్ దక్కించుకుంది . పెళ్లి సందడి అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునింది . అంతేనా ఒకటి కాదు రెండు కాదు హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . ఎంతలా అంటే అబ్బాయిలు శ్రీ లీల పేరుని తమ చేతిపై చాతిపై పచ్చబొట్టుపొడిపించుకునే అంతలా .


ఇలాంటి ఒక క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవాలి అంటే మామూలు విషయం కాదు . కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఈ బ్యూటీ అలాంటి క్రేజ్ దక్కించుకుంది . కాగా శ్రీ లీల సినిమాలు ఫ్లాప్ అయినా సరే ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.  ప్రెసెంట్ పలు సినిమాలతో తన పేరుని మళ్లీ ఫామ్ లోకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది .



శ్రీలీలకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా ఉంటుంది . అయితే అది టోటల్గా ఆమె పర్సనల్ కు సంబంధించిన మ్యాటర్ కావడంతో ఈ న్యూస్ ని ఇంకా బాగా ట్రెండ్ చేస్తున్నారు శ్రీ లీల అభిమానులు. సాధారణంగా అందరూ ముద్దు పేర్లు పెట్టి పిలుచుకుంటూ ఉంటారు.  అలాగే శ్రీలీలకు కూడా ఒక ముద్దు పేరు ఉంది . అయితే అది చాలా చాలా ఫన్నీగా ఉండటంతో జనాలు నవ్వుకునేస్తున్నారు . శ్రీ లీలాని ముద్దుగా "షీకూ" అంటూ పిలుచుకుంటూ ఉంటారట . అది వాళ్ళ అమ్మగారు తనకు పెట్టిన పేరట . చాలామంది తన క్లోజ్ ఫ్రెండ్స్ కూడా షీకు అంటూ పిలుస్తూ వస్తారట . శ్రీ లీలా కి కూడా అలా పిలిస్తే మహా మహా ఇష్టమట..!!

మరింత సమాచారం తెలుసుకోండి: