అసలు విషయంలోకి వెళితే వచ్చే డిసెంబర్లో పుష్ప2 ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇదే క్రమంలో మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ గొడవ కారణంగా ఈ ప్రభావం పుష్ప మీద పడే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అలాగే రామ్ చరణ్ కూడా త్రిబుల్ ఆర్ విడుదలైన వెంటనే స్టార్ దర్శకుడు శంకర్ తో గేమ్ చేంజెర్ సినిమాను మొదలు పెట్టాడు. శంకర్ కూడా గతి కొన్ని సంవత్సరాలుగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన ఇండియన్ 2 భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు గేమ్ చేంజర్ పై కూడా ప్రభావం గట్టిగా ఉంటుంది.. అలాగే ఈ సినిమా నుంచి వస్తున్న పాటలు , పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచలేకపోతున్నాయి. డిసెంబర్లో విడుదల కావలసిన ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించారు.
ఇక అలాగే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో 2019లోనే ప్రకటించిన ఇప్పటి వరకు సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు. అయితే ఈ సినిమాను మొదట తెలుగు లో తీయాలని అనుకున్న సినిమాకు వచ్చిన హైప్ తో పాన్ ఇండియా సినిమాగా తీయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ సినిమా మొదటి బాగాని వచ్చే సంవత్సరం మార్చిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక మరొకవైపు ప్రభాస్ రాబోయే చిత్రం రాజా సాబ్. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు. కానీ గత కొన్ని సినిమాలు డిజాస్టర్లు కావడం ముఖ్యంగా పక్కా కమర్షియల్ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఇలాంటి సినిమా ఎందుకు అంగీకరించారు అంటూ ఒక వర్గం అభిమానులు ప్రభాస్ ను ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన ఈ సినిమా విడుదల కాన్నుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా విశ్వంభర ను విడుదల చేయబోతున్నారు. అలాగే.. నిన్న విడుదలైన టీజర్ మాత్రం ప్రేక్షకులలో నిరాశ మిగిల్చింది. ఈ చిత్రాన్ని మేలో విడుదల చేయాలని భావిస్తున్నారట. ఏదిఏమైనా ఒకప్పుడు చాలా ఆశాజనకంగా కనిపించిన పెద్ద సినిమాలు ఇప్పుడు రిస్క్ గా కనిపించడం గమనార్హం.
[12:42 pm, 15/10/2024] Leela: