ఇటీవల కాలంలో సోషల్ మీడియా హవా ఎంత కీ రోల్ పోషిస్తుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సినిమా నటులకు ఇది చాలా అత్యవసరం కూడా. హీరోలకు, అభిమానులకు మధ్య సోషల్ మీడియా వారధిగా పనిచేస్తుంది. అది ఏ ఫ్లాట్ ఫామ్ అయినా సరే హీరోలు తమ చిత్రాలకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ ను వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకుంటూ అభిమానులకు చేరువవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏ హీరోను ఎంతమంది ఫాలో అవుతున్నారు అనేది ఒక రికార్డుగా కూడా భావిస్తారు. మరి ఇంస్టాగ్రామ్ వేదికగా ఏ హీరోకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇంస్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోగా పుష్పరాజ్ అలియాస్ అల్లు అర్జున్ నిలిచారు. 26.4 మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉండి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు అల్లు అర్జున్. ఇక తర్వాత 25 మిలియన్ ఫాలోవర్స్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండవ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక మూడవ స్థానంలో విజయ్ దేవరకొండ 21.8 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉండగా.. నాల్గవ స్థానంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు 14.4 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు.

ఇక ఐదవ స్థానంలో రెబల్ స్టార్ ప్రభాస్ 12.8 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు. ఇకపోతే మార్చి నెలలో 21 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉన్న రామ్ చరణ్, అతి తక్కువ సమయంలోనే 25 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అల్లు అర్జున్ ,రామ్ చరణ్ instagram లో నువ్వా నేనా అన్నట్టు ఫాలోవర్స్ ను సొంతం చేసుకునే పనిలో పడ్డారు.  అటు సినిమాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో డిసెంబర్ ఐదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుండగా మరొకవైపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: