ఎవరి అండ లేకుండా వచ్చిన చిరంజీవి ఇప్పుడు ఇండస్ట్రీకి అండగా నిలిచే స్థాయిలో ఉన్నారు. అలాంటి చిరంజీవి కెరీర్ మొదటి రోజుల్లో చిన్నాచితక పాత్రల్లో నటిస్తూ కనిపించేవాడు. అలాంటి చిరంజీవిని స్టార్ హీరోగా మలిచిన చిత్రం ఖైదీ. ఆ తర్వాత మెగాస్టార్ గా మారాడు. ఇక ఇటీవలే బోలాశంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే శ్రద్ధ కపూర్ కి చిరంజీవితో మంచి బాండింగ్ ఉంది.
శ్రద్ధ కపూర్ తండ్రి శక్తి కపూర్ బాలీవుడ్ లో నెంబర్ వన్ విలన్. ఆయన చిరంజీవి నటించిన యుద్ధభూమి సినిమాలో విలన్ పాత్రలో నటించారు. చిరంజీవి నటించిన పలు హిందీ రీమేక్ సినిమాల్లో హీరోను ఢీకొట్టే విలన్ పాత్రల్లో నటించారు. ఈ రకంగా చిరంజీవి ఫ్యామిలీతో శ్రద్ధా కపూర్ తండ్రి శక్తి కపూర్ కి మంచి అనుబంధము ఉంది. వీరు తరచుగా పార్టీల్లో కలుసుకుంటూ ఉంటారు.
కాగా శ్రద్ధ కపూర్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ అగ్ర కథానాయకగా నాయికగా సత్తా చాటుతుంది. రీసెంట్ గా "స్త్రీ 2" సినిమాతో బాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ అందుకుంది. అంతేకాదు ఈ బ్యూటీ ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాలో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇక శ్రద్ధ కపూర్ అభిమానులు తాను మరిన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు.