అటు బెయిల్ పిటిషన్ పైన దర్శన్ న్యాయవాది, ప్రభుత్వా న్యాయవాది వాదనలను సైతం వినిపించారు. దీంతో జడ్జి సైతం చివరికి బెయిల్ ఇవ్వలేమంటూ ప్రకటించారు. ఈ విషయం పైన అటు దర్శన్ భార్య విజయలక్ష్మి మాత్రం చాలా కన్నీరు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం చూసిన అభిమానులు సైతం తీవ్ర దుఃఖంలోకి వెళ్లిపోయారు. తన భర్తకి బెయిల్ వస్తుందని ఆశించిన దర్శన్ భార్య రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైందట..
దర్శన్ అరెస్ట్ అయినప్పటి నుంచి తన భార్య విజయలక్ష్మి బెయిల్ కోసం చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. ఎంతోమంది టాప్ లాయర్లను సైతం తీసుకు వస్తున్న బెయిల్ విషయంలో నిరాశ మిగులుతోంది. అంతేకాకుండా దర్శన్ జైలులో కూడా విలాసవంతమైన జీవితాలను గడుపుతూ ఉండడంతో చాలా మంది విమర్శించడం కూడా జరిగింది. జూన్ 10వ తేదీన బెయిల్ వస్తుందని అనుకున్నప్పటికీ ఎదురుదెబ్బ తగిలిందట. చివరికి దర్శనాన్ని పరప్పన్ అగ్రహారం జరిగిన నుంచి బళ్లారి జైలుకు సైతం తరలించారు. ఇక పవిత్రం గౌడ మాత్రం ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు మరొకసారి దర్శన్ , పవిత్ర గౌడ బెయిల్ క్యాన్సిల్ అవ్వడంతో అభిమానులు నిరాశతో ఉన్నారు