ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి  కేవలం స్వయంకృషితో అంచలంచలుగా ఎదుగుతూ వచ్చి తెలుగు ప్రేక్షకులందరికీ హృదయాలలో మెగాస్టార్ గా తిష్ట వేసుకున్నాడు చిరంజీవి. దాదాపు మూడు నాలుగు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. మరియు ముఖ్యంగా 90 లలో అయితే ఆయనను మించిన స్టార్ హీరో ఇండస్ట్రీలో ఇంకొకరు లేరు అనే విధంగా హవా నడిపించారు. అంతేకాదు ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా రికార్డ్ సృష్టించారు.


 మెగాస్టార్ చిరంజీవి ఇలా హీరోగా ఎదగడమే కాదు.. తన ఫ్యామిలీ నుంచి ప్రస్తుతం అరడజనుకు పైగా హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రానిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా తన తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్ లను కూడా ఇండస్ట్రీలో నటులుగా పరిచయం చేశారు. కాగా పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా ఎదిగితే  నాగబాబు మాత్రం మొదట్లో హీరోగా కొన్ని సినిమాల్లో చేసినప్పటికీ ఆ తర్వాత మాత్రం కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే సెట్ అయిపోయాడు. అయితే చిరంజీవికి తన ఇద్దరు తమ్ముళ్ళతో ఉన్న అనుబంధం మాటల్లో వర్ణించలేదని. సమయం సందర్భం వస్తే చాలు ఇక ఆ బంధం గురించి ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటారు ఆయన.


 అయితే తన పెద్ద తమ్ముడు నాగబాబుపై ఒకానొక సమయంలో చేయి చేసుకున్నాను అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు చిరంజీవి. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో.. అమ్మకు సహాయంగా అన్ని పనులు నేనే చేస్తూ ఉండేవాడిని. ఓ రోజు లాండ్రి నుంచి బట్టలు తేవాల్సి ఉంది. అదే సమయంలో మరొక పని కూడా పడింది. నేను బయటకు వెళ్తున్న లాండ్రి దగ్గరికి వెళ్లి బట్టలు తెమ్మని నాగబాబుకి చెప్పాను. నేను పని చేసుకుని ఇంటికి వచ్చాక.. బట్టలు తెచ్చావా అని నాగబాబును అడిగితే లేదు అన్నాడు. ఎందుకు తేలేదు అంటే.. నిద్రపోయానని సమాధానం చెప్పాడు. దీంతో నాకు కోపం వచ్చి నాగబాబుని కొట్టేసాను. నాగబాబుని కొట్టినందుకు మా అమ్మ నాపై కోప్పడింది. ఇక సాయంత్రం నాన్న వచ్చాక జరిగిందంతా చెప్పాను. ఇక నాన్న కూడా నాగబాబును మందలించాడు. అప్పుడు నాకు సంతృప్తి అనిపించింది అంటూ తన చిన్నప్పుడు జరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.

మరింత సమాచారం తెలుసుకోండి: