ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో నటించిన విక్రమ్.. తన సినిమాలని తెలుగులో కూడా డబ్ చేసి ఇక్కడ మంచి విజయాలను అందుకున్నాడు. ఇక్కడ విక్రమ్ సినిమాలకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు ఎన్నో సినిమాలను తెలుగులో డబ్ చేసినప్పటికీ ఒక్క సినిమాని కూడా డైరెక్ట్ గా తెలుగులో చేయలేదు. అయితే గతంలో డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలనే ఉద్దేశం ఉంది అంటూ మనసులో మాట బయటపెట్టేసాడు ఈ హీరో. ఈ విషయాన్ని కార్యాచరణలో కూడా పెట్టాడట. ఇప్పటికే పలువురు తెలుగు డైరెక్టర్లతో చర్చలు కూడా జరుపుతున్నాడట.
మొత్తానికి చాలా రోజుల చర్చల తర్వాత ఇక ఒక తెలుగు డైరెక్టర్ చెప్పిన కథ విక్రమ్ కి తెగ నచ్చేసిందట. దీంతో ఆ డైరెక్టర్ తోనే నేరుగా తెలుగు సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు వెంకీ అట్లూరి. అయితే ప్రస్తుతం ఈ డైరెక్టర్ ఇప్పటికే వేరే సబ్జెక్టుతో బిజీగా ఉన్నారు. ఇక ధనుష్ తో సార్ అనే సినిమా తీసి మంచి విజయాన్ని కూడా అందుకున్నాడు.